ఇవన్నీ ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి..? ఈ విషయం ఆలోచించారా..?

ఇవన్నీ ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి..? ఈ విషయం ఆలోచించారా..?

by Mohana Priya

Ads

ఇండస్ట్రీలో హీరోలకి హీరోలకి మధ్య స్నేహం ఉండదు అని అంటారు. కానీ అది తప్పు అని చాలా మంది హీరోలు నిరూపించారు. అయితే హీరోలకి, డైరెక్టర్లకి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. కొంత మంది అయితే సినిమా అయిపోయిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు స్నేహితులుగా కొనసాగుతుంటారు.

Video Advertisement

అలా మన ఇండస్ట్రీలో ఒక హీరో, ఒక దర్శకుడు చాలా మంచి స్నేహితులు అవ్వడం చూస్తూనే ఉంటాం. కొంత మంది దర్శకులను ఇదే విషయానికి ట్రోల్ కూడా చేస్తూ ఉంటారు. ఇటీవల ఒక దర్శకుడి గురించి కామెంట్స్ వస్తున్నాయి.

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎక్కడో ఒక ఊరి నుండి ఇండస్ట్రీకి వచ్చి, ముందు మాటల రచయితగా, ఆ తర్వాత దర్శకుడుగా పనిచేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా చదివితే ఆయన పేరు చెప్పకపోయినా ఆయన ఎవరో తెలిసిపోయి ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా ఉన్నప్పుడు ఆయన మాటల వల్ల హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. చాలా సున్నితమైన అంశాల మీద సినిమాలు తీస్తారు అని, ఎమోషన్స్ తో పాటు కాస్త లైట్ హార్టెడ్ కామెడీ కూడా ఆయన సినిమాల్లో ఉంటుంది అని అంటూ ఉంటారు.

Trivikram

అప్పటి వరకు మనం ఒకరకంగా చూసిన ఆ హీరోని ప్రేక్షకులకు ఇంకొకరకంగా చూపించే దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందు వరుసలో ఉంటారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సినిమాలు కొన్నే అయినా కూడా, ప్రతి సినిమాకి తనని తాను నిరూపించుకుంటూ వస్తున్నారు. అయితే ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్న కారణంగా కొంత మంది స్నేహితులు అయినా ఉంటారు. అలా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఎంతో మంది స్నేహితులు ఉన్నా కూడా, మొదటిగా గుర్తొచ్చే పేరు పవన్ కళ్యాణ్. వీరిద్దరూ ఒకరికి ఒకరు చాలా సంవత్సరాల నుండి తెలుసు.

why trivikram is missing in pavan's new movie launch..??

ఇద్దరూ కలిసి సినిమాలు కూడా చేశారు. కాబట్టి ఆ మాత్రం స్నేహం ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో త్రివిక్రమ్ ప్రమేయం కూడా ఉంటుంది అనే వార్తలు చాలా సంవత్సరాల నుండి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో చాలా సినిమాలు రీమేక్ సినిమాలు. అసలు వాటిలో ఇటీవల వచ్చిన కొన్ని రీమేక్ సినిమాలు పవన్ కళ్యాణ్ చేయడానికి కారణం త్రివిక్రమ్ అని, త్రివిక్రమ్ ఆ సినిమాలని రీమేక్ చేయమని పవన్ కళ్యాణ్ కి సూచించారు అని, అవి తెలుగుకి తగ్గట్టు మార్పులు కూడా చేశారు అని అంటున్నారు.

tollywood directors and their sentiments..!!

ఇదే విషయాన్ని ఇటీవల బ్రో డైరెక్టర్ సముద్రఖని మాటల మధ్యలో చెప్తూ, ఒక సందర్భంలో సముద్రఖని ఈ సినిమా స్టోరీని త్రివిక్రమ్ శ్రీనివాస్ కి వినిపిస్తే, త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంటనే ఈ సినిమా పవన్ కళ్యాణ్ తెలుగులో చేస్తే మీకు ఓకేనా అని అడిగి, దానికి తగ్గట్టు పది నిమిషాల్లో సినిమా స్టోరీ మార్చేశారు అని అన్నారు.  ఆయన చెప్పిన ఉద్దేశం ఏమైనా కానీ, అది సినిమా రిజల్ట్ తర్వాత నెగిటివ్ అయ్యింది. త్రివిక్రమ్ పది నిమిషాల్లో సినిమా స్టోరీ మార్చేశారు, అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది అని అనడం మొదలు అయ్యింది.

అయితే అలా త్రివిక్రమ్ ప్రమేయంతో వచ్చిన సినిమా కేవలం ఇది మాత్రమే కాదు. అంతకు ముందు వచ్చిన భీమ్లా నాయక్ సినిమా రూపకల్పనలో కూడా త్రివిక్రమ్ చాలా ముఖ్య పాత్ర పోషించారు. అంతే కాకుండా వకీల్ సాబ్ సినిమాలో కూడా త్రివిక్రమ్ ప్రమేయం ఉంది అని అంటారు. ఆ రెండు సినిమాలు హిట్ అవ్వడంతో అప్పుడు త్రివిక్రమ్ ని ఎవరూ ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ మారడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై కొంత మంది మరొక కోణంలో కూడా కామెంట్స్ చేస్తున్నారు.

అదేంటంటే, “ఎంత త్రివిక్రమ్ చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ ఆలోచన కూడా ఉంటేనే సినిమా రూపొందుతుంది. ఏ సినిమా చేయాలి అనే ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ కి కూడా ఉంటుంది.  త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన దానికి సరే అని అయితే పవన్ కళ్యాణ్ అనలేరు. అంతా ఆలోచించి మాత్రమే పవన్ కళ్యాణ్ సినిమా చేస్తారు. ఒకవేళ సినిమా హిట్ అయితే పవన్ కళ్యాణ్ పవర్ అంటారు, ఇప్పుడు ఒక్కసారి సినిమా రెస్పాన్స్ ఇలా ఉంటే త్రివిక్రమ్ ని మాత్రం ఎందుకు అంటున్నారు?” అని కామెంట్స్ చేస్తున్నారు.

“సినిమా హిట్ అయినప్పుడు కూడా త్రివిక్రమ్ కి క్రెడిట్ ఇవ్వాలి కదా? కేవలం ఫ్లాప్ అయినప్పుడు మాత్రమే త్రివిక్రమ్ ని ఎందుకు అనడం?” అని అంటున్నారు.  దీనికి చాలా మంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలకి ఎన్నో కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు అని, ఒక ఫ్రెండ్ సినిమాకి చేస్తూ అన్ని కోట్ల డబ్బులు తీసుకోవడం ఎందుకు అని అంటున్నారు.

ఈ విషయంపై కూడా కామెంట్స్ వస్తున్నాయి. “ఎంత స్నేహితుడు అయినా కూడా త్రివిక్రమ్ ఒక స్టార్ డైరెక్టర్. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. ఆయనకు ఎంతో ప్రతిభ ఉంది కాబట్టి ఆయనని హీరోలు అంతగా నమ్ముతున్నారు. మరి అలాంటి ప్రతిభ ఉన్న దర్శకుడు ఉచితంగా ఎందుకు పని చేస్తారు?” అని అంటున్నారు. ఏదేమైనా సరే ఈ విషయంపై రెండు రకమైన వాదనలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి.

ఇది ఇప్పటి నుంచి కాదు. ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న విషయం. ఈ కామెంట్స్ ఎంతో మంది డైరెక్టర్ల మీద వచ్చాయి. వాళ్లు హిట్ సినిమాలు తీసినప్పుడు వాళ్ళని ఎంత పొగుడుతారో, అదే వాళ్లు పొరపాటున ఒక్క ఫ్లాప్ సినిమా చేస్తే దానికి రెండు రెట్లు ఎక్కువగా వారిపై కామెంట్స్ వస్తాయి. కానీ మన ఇండస్ట్రీలో సినిమా హిట్ అయితే క్రెడిట్ మొత్తం హీరోకి ఇచ్చేయడం, అదే సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్ ని, లేకపోతే ఆ సినిమా హీరోయిన్ ని ఐరన్ లెగ్ అనడం, వాళ్ల వల్ల సినిమా పోయింది అనడం కామన్ అయిపోయింది ఏమో.

ALSO READ : మొదటి ఎపిసోడ్ నుండి క్లైమాక్స్ వరకు… ఏం అవుతుంది అనే సస్పెన్స్..! ఈ సిరీస్ చూశారా..?


End of Article

You may also like