“ఏంటి ఇది అంతా..? అసలు ఏం జరుగుతోంది..?” అంటూ… నెటిజన్స్ కామెంట్స్..! కారణం ఏంటంటే..?

“ఏంటి ఇది అంతా..? అసలు ఏం జరుగుతోంది..?” అంటూ… నెటిజన్స్ కామెంట్స్..! కారణం ఏంటంటే..?

by kavitha

Ads

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘గుంటూరు కారం’. ఈ మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలుపెట్టారు. అయితే అనివార్య కారణాలతో ఈ మూవీ  షూటింగ్ సజావుగా జరగడం లేదు.

Video Advertisement

అనుకన్న సమయానికి ఈ మూవీని రిలీజ్ చేసే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. తాజాగా గుంటూరు కారం సినిమా  నుండి షాకింగ్ వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
thamanమహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమాకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌ తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ గ్లింప్స్ కు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం తమన్ ను ఈ మూవీ నుండి తప్పించారని ప్రచారం జరిగింది. ఆ తరువాత రిలీజ్ అయిన గ్లింప్స్ తో  అవన్నీ రూమర్స్ అని తేలింది. అయితే, తాజాగా తమన్ ను గుంటూరు కారం నుంచి తొలగించారనే ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుండి పూజా హెగ్డే తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమన్ ను తొలగించినట్లుగా వస్తున్న వార్తలలో వాస్తవం లేదని తెలుస్తోంది. వైజే రాంబాబు అనే ఎడిటర్ ఈ విషయం పై క్లారిటీ ఇస్తూ “మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి తమన్ ని తప్పిస్తున్నారు అనే మాట అవాస్తవం. ఈ నెల 24 నుంచి షూటింగ్, జనవరి 13న రిలీజ్. ఒకవేళ అదే రోజు ప్రభాస్ ప్రాజెక్ట్ K ఉంటే మాత్రం ఒక రోజు ముందుగానే రిలీజ్” అని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కి ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా రెస్పాండ్ అయ్యారు.
మరో వైపు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ట్వీట్ చేశాడు. తన ట్విట్టర్ అకౌంట్ లో మజ్జిగ గ్లాస్ ఇమేజ్ ను షేర్ చేసి,  “రేపటి నుండి నా స్టూడియోలో ఫ్రీగా మజ్జిగ స్టాల్స్‌ను మొదలుపెడుతున్నాను. కడుపు మంట లక్షణాలతో ఇబ్బందీపడేవారికి స్వాగతం. నా టైమ్ ని వెస్ట్ చేయకూడదని భావిస్తున్నాను” అని రాసుకొచ్చాడు. ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో తమన్ ను తొలగించారనే వార్తలు రూమర్స్ అని తేలింది. హీరోయిన్ పూజా హెగ్డే విషయం తెలియాల్సి ఉంది.

Also Read: చూడడానికి అచ్చం “పూజా హెగ్డే” లాగానే ఉంది కదా..? ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?


End of Article

You may also like