Ads
గత ఏడు సంవత్సరాల క్రితం ప్రకటించిన… అప్పటినుండి కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న చిత్రం ఏదైనా ఉందా అంటే అది ధ్రువ నక్షత్రం. తమిళ్ హీరో చియాన్ విక్రమ్ మెయిన్ లీడ్ గా, స్టైలిష్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లలో విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
Video Advertisement
అయితే తాజాగా ఈ చిత్రం మొదటి పార్ట్ నవంబర్ 24 వ తారీఖున విడుదల కావాల్సి ఉంది. అయితే ఉన్నటు ఉండి పొద్దున రిలీజ్ అనగా మళ్ళీ పోస్ట్ పోన్ అయినట్లు డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్వయంగా ప్రకటించారు. అయితే ఆయన ఎమోషనల్ గా ఈ ప్రకటన చేశారు.
ధ్రువ నక్షత్రం ట్రైలర్ చూడగానే మంచి యాక్షన్ ఓరియంటెడ్ ఫీలిం అని అందరికీ అర్థమైంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ చిత్రాలు ఎంత బాగుంటాయో తెలిసిందే.ఘర్షణ, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలు మంచి ఉదాహరణ.అయితే ఈ చిత్రానికి మధ్యలో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎదురయ్యాయి. షూటింగ్ ఆగడం, మళ్ళీ స్టార్ట్ అవ్వడం ఇలా జరుగుతూ వచ్చేది. ఈ సినిమా షూటింగ్ ఆగకుండా దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ వేరే సినిమాల్లో కూడా కీలకపాత్రలో నటిస్తూ ఈ సినిమా షూటింగ్ జరిపేవారు. గౌతమ్ వాసు దేవ్ మీనన్ లాంటి ఒక స్టార్ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఇలాంటి పరిస్థితి ఎదురవడం నిజంగా దురదృష్టకరం.
ధ్రువ నక్షత్రం సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు హరీష్ జయరాజ్ అందించిన సంగీతం బాగా ప్లస్ అయింది. గౌతమ్ మీనన్ హరీష్ జయరాజ్ కాంబినేషన్ లో మంచి మ్యూజికల్ హిట్స్ కూడా వచ్చాయి.మంచి కాంబినేషన్, మంచి యాక్టర్లు, మంచి డైరెక్టర్ ఉన్న ఈ చిత్రం ఎందుకు పదేపదే వాయిదా పడుతుందో అభిమానులకు అర్థం కావట్లేదు.వేరే ఏ ఇతర చిత్రాలైనా కూడా ఏడు సంవత్సరాల నుండి ఇబ్బందులు పడుతుంటే ఈపాటికి ముగిసిపోయేవి. కానీ ధ్రువ నక్షత్రం మాత్రం ఇంకా ఆడియన్స్ లో తన క్రేజ్ ని నిలబెట్టుకుంటూనే ఉంది. త్వరలో ఈ చిత్రం విడుదల అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
End of Article