ఇదేందయ్యా ఇది… ఫ్లైట్ ఎక్కితే “క్యూట్ ఛార్జెస్” విధిస్తారా?.. అసలు కథ ఏంటో చూడండి..!

ఇదేందయ్యా ఇది… ఫ్లైట్ ఎక్కితే “క్యూట్ ఛార్జెస్” విధిస్తారా?.. అసలు కథ ఏంటో చూడండి..!

by Anudeep

Ads

మీరు అందంగా ఉన్నారా… అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయం అవ్వాల్సిందే.. విమానం టికెట్ లోని ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ ఫీ, యూజర్ డెవలప్మెంట్ ఫీ అంటూ వివిధ రకాల చార్జీలు వేస్తుంటారు విమాన సర్వీస్ కంపెనీ వారు. అయితే కొత్తగా ఇప్పుడు ఇండిగో విమానంలో ప్రయాణించిన వారికి క్యూట్ చార్జెస్ అంటూ వసూలు చేయడం ప్రయాణికులను ఆశ్చర్యానికి గురి చేసింది.

Video Advertisement

ఇదేంటి అందంపై రుసుము వసూలు చేయడం అంటూ తికమక పడుతున్నారు ప్రయాణికులు. ఇండిగో ఎయిర్ లైన్స్ లో ప్రయాణించిన శాంతాను అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తనకు ఎదురైన ఈ సంఘటన పోస్ట్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది చూసిన నెటిజన్లు ఇండిగో ఎయిర్ లైన్  సంస్థ పై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. శాంతను, “నా వయసులో నేను అందంగా కనిపిస్తానని నాకు తెలుసు. దానికి కూడా నేను ఇలా చార్జెస్ కట్టవలసి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు” అని పేర్కొన్నారు. శాంతాను ప్రయాణించిన ఇండిగో ఎయిర్లైన్స్ టికెట్ చార్జెస్ తో సహా తన ట్విట్టర్ ఎకౌంట్లో షేర్ చేశారు. దీనిలో ఎయిర్ఫేర్ చార్జెస్, సీట్ ఫీ, కన్వీనన్స్ ఫీ, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఫీ, యూజర్ డెవలప్మెంట్ ఫీ తో పాటు క్యూట్ చార్జెస్ అంటూ వంద రూపాయలు అదనంగా ఛార్జ్ వేయబడింది.

శాంతాను చేసిన పోస్ట్ కి మరో వ్యక్తి కూడా సమాధానమిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. “ఈ కొత్త చార్జీల కారణంగా నేను ఇండిగోలో ప్రయాణించడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే విమానం టికెట్ ధర కన్నా మిగతా ఫీజులు వసూలు చేయడం అదనపు భారంగా ఉంటుంది.” వాళ్ల  ప్రశ్నలకు సమాధానంగా ఇంతకీ ఏంటి ఈ క్యూట్ ఛార్జ్ అనే విషయాన్ని ఇండిగో సంస్థ వెల్లడించింది. క్యూట్( cute) యొక్క పూర్తి రూపం కామన్ యూజర్ టర్మినల్ ఎక్యుప్మెంట్. ఇది మెటల్ డిటెక్టర్ మిషన్లు, ఎస్కలేటర్లు ఇతర పరికరాలను ఉపయోగించేందుకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా వసూలు చేయబడుతున్న మొత్తం అని చెప్పుకొచ్చారు.


End of Article

You may also like