Ads
‘కాంతార’.. గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్న కన్నడ చిత్రం. భాష తో సంబంధం లేకుండా ప్రతి చితా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది చిత్రం. హీరో గా.. దర్శకుడిగా రిషబ్ శెట్టి చేసిన అద్భుతానికి అన్ని భాషల్లో మంచి స్పందన వస్తోంది. మరుగున పడిపోతున్న కళలకి దృశ్యరూపం ఇచ్చిన రిషబ్ శెట్టి పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Video Advertisement
రెండు ప్రధాన పాత్రల్లో నటిస్తూ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. కన్నడ వెర్షన్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అద్భుతమైన బాక్సాఫీస్ కలెక్షన్లను ఈ సినిమా నమోదు చేస్తుంది. మొదటి రోజు మంచి టాక్ తెచ్చుకున్న తర్వాత క్రమక్రమంగా ఈ చిత్రం అసాధారణమైన స్పందనను పెంచుకుంటూ కలెక్షన్లలో గణనీయమైన అభివృద్ధిని కనబరిచింది. ముఖ్యం గా క్లైమాక్స్ లో అయితే ప్రేక్షకులను మరో లోకం లోకి తీసుకెళ్తోందని సాధారణ ప్రేక్షకుల నుంచి సెలెబ్రెటీల వరకు అందరూ అభినందనలు కురిపిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు రంగస్థలం సినిమాకు కొన్ని పోలికలు ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన “రంగస్థలం” సినిమా మెగా అభిమానులకు మర్చిపోలేని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒక చెవిటి వాడి పాత్రలో నటించి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో రామ్ చరణ్ అందరి దృష్టిని ఆకర్షించారు.
ఇకపోతే దేవుడి కాన్సెప్ట్ పక్కన పెడితే కథ రెండు సినిమాల కథ ఒకటే అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రంగస్థలం సినిమాలో ప్రెసిడెంట్ కు పోటీగా నిలబడ్డాడు అనే కారణంతో రామ్ చరణ్ తన అన్నను ప్రెసిడెంట్ చంపేశారు అని భావించి అతనిపై పగ తీర్చుకుందాం అనుకుంటాడు. కానీ అసలు విలన్ ప్రకాష్ రాజ్ అని తెలిసి అతడిని హత మారుస్తాడు.
అదే విధంగా కాంతార సినిమా క్లైమాక్స్ ఉంది. కాంతార సినిమాలలో మొదట దొరకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి తన తమ్ముడిని చంపాడని కోపంతో అతడిని చంపేందుకు సిద్ధమవుతాడు. కానీ చివరికి దొరే అసలు దొంగ అని తెలుసుకుని దేవుడి లా వచ్చి హతమారుస్తాడు.
మరోవైపు ఈ రెండు సినిమాలను విలేజ్ బ్యాక్ డ్రాప్ తో రియలిస్టిక్ గా తెరకెక్కించారు. కాగా ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాలుగా నిలిచాయి.
End of Article