అన్ని మోడరన్ పేర్లు ఉన్నా.. శ్రియ తన పాపకి “రాధ” అన్న పేరు పెట్టడానికి కారణం ఏంటి..?

అన్ని మోడరన్ పేర్లు ఉన్నా.. శ్రియ తన పాపకి “రాధ” అన్న పేరు పెట్టడానికి కారణం ఏంటి..?

by Anudeep

Ads

టాలీవుడ్ హీరోయిన్ శ్రియ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చి.. దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆమె నటించింది. ప్రస్తుతం కూడా ఆమె పలు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ ఉన్నారు. వృత్తిగతంగానే కాదు.. శ్రియ వ్యక్తిగతంగా కూడా హ్యాపీ లైఫ్ స్టైల్ ను ఆస్వాదిస్తున్నారు. ఆండ్రూ కోశ్చీవ్ ను ప్రేమించి పెళ్లిచేసుకున్న శ్రియ సంసారం జీవితాన్ని కూడా హ్యాపీగానే గడిపేస్తున్నారు.

Video Advertisement

sriya saran

తాజాగా.. ఆమె ఓ షాకింగ్ న్యూస్ ను తన అభిమానులతో పంచుకున్నారు. స్పెయిన్ -బార్సిలోనాలో పాపకు జన్మనిచ్చారట. భర్త ఆండ్రీ ఈ పాపకు “రాధ” అన్న అచ్చ తెలుగు పేరును పెట్టారు. పాప గురించి చెబుతూ..” రాధ నా బెస్ట్ ఫ్రెండ్.. నా ప్రపంచం..” అంటూ శ్రియ ఎమోషనల్ అయ్యారు. ఏడాది క్రితమే శ్రియ గర్భవతి అయ్యారు. అయితే.. ఈ వార్తలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.

sriya saran 1

అయితే.. కూతురు పేరు “రాధ” అని అనౌన్స్ చేయగానే.. ఆ పేరే పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన శ్రియ తన కూతురుకు “రాధ” అని పేరు పెట్టడం వెనుక కారణం చెప్పుకొచ్చారు. ఆమెకు కూతురు పుట్టగానే.. శ్రియ తల్లి రాధ రాణి వచ్చేసింది అని అన్నారట. అది విన్న శ్రియ హస్బెండ్ ఆండ్రు కొశ్చివ్ మీ అమ్మగారు ఆనడంలో రష్యన్ మాట్లాడారుగా అన్నారట.

sriya saran 2

ఇంతకీ “రాధ” అనే పదానికి రష్యన్ భాషలో సంతోషం అని అర్ధం వస్తుందట. ఇతర భాషల్లో కూడా “రాధ” అన్న పదానికి మంచి అర్ధాలు ఉన్నాయట. అందుకే.. అందరు కలిసి ఆలోచించి ఆ పేరునే పెట్టేయాలని ఫిక్స్ అయ్యారట. రాధ కు చివరలో కొశ్చివ్, శరణ్ అనే పదాలను కూడా కలిపాం అంటూ చెప్పుకొచ్చారు.

 


End of Article

You may also like