Home Filmy Adda “విజయ్ దేవరకొండ” లేటెస్ట్ పోస్ట్ వెనుక అర్థం అదేనా..??

“విజయ్ దేవరకొండ” లేటెస్ట్ పోస్ట్ వెనుక అర్థం అదేనా..??

by Anudeep

ఎన్నో అంచనాలతో పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన ‘లైగర్’ అభిమానులకు నిరాశనే మిగిల్చింది. ‘పూర్ కనెక్ట్స్’ బ్యానర్ లో పూరి, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర ఫలితం అందరికీ షాక్ ని ఇచ్చిందనే చెప్పొచ్చు.

లైగర్ చిత్రం తో పాన్ ఇండియా స్టార్ గా వెలగలనుకున్న విజయ్ ఆశలపై ఆ చిత్ర ఫలితం నీళ్లు కొట్టేసింది. ఈ సినిమాపై దర్శకుడు పూరి జగన్నాథ్, విజయ్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. తీరా చూస్తే మొత్తం తల్లకిందులైంది.

what is the reason behind vijay's post
మరో వైపు ఈ చిత్ర పరాజయంతో పూరి, విజయ్ మధ్య గ్యాప్ వచ్చినట్లు సమాచారం. తన సోషల్ మీడియా ఖాతాల్లో ఇప్పటి వరకు లైగర్ సినిమా గురించే మాట్లాడని విజయ్.. తాజాగా పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ‘సింగిల్ ప్లేయర్'(ఒంటరి ఆటగాడిని) అని కాప్షన్ తో తన ఫోటోని విజయ్ పోస్ట్ చేయడంతో.. ఇది వారిని ఉద్దేశించే పెట్టాడా అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

what is the reason behind vijay's post
మరో వైపు ఛార్మి కూడా కొన్ని రోజుల క్రితం తాను కొన్నాళ్ళు సోషల్ మీడియాకు దూరం గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఒక పోస్ట్ పెట్టడంతో.. అసలు ఎం జరిగింది అని చర్చించుకున్నారు జనాలు. దీనిపై అనేక పుకార్లు రావడంతో ‘పూరి కనెక్ట్స్’ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ పనులు చేసుకుంటూ ఉందని ఛార్మి సమాధానం ఇచ్చారు.

what is the reason behind vijay's post
అలాగే మరోవైపు విజయ్ కూడా తన సినిమాలు చేసుకుంటా అనే అంటున్నాడా అని సందేహాలు కలుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో పూరి తన డ్రీం ప్రాజెక్ట్ జనగణమన ను విజయ్ తో చేయనున్నట్లు గతం లో ప్రకటించాడు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ప్రశ్నార్థకం లా మారేలా ఉందే అనుకుంటున్నారు నెటిజన్లు. ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఏదేమైనా అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆ సినిమా గురించి అప్డేట్ లేనట్టే అనుకుంటున్నారు సినీ జనాలు.

You may also like