Ads
పద్మశ్రీ తర్లా దలాల్ ఫేమస్ ఇండియన్ ఫుడ్ రైటర్, చెఫ్, వంట పుస్తక రచయిత మరియు వంట ప్రోగ్రామ్స్ కి హోస్ట్. తర్లా వంద పుస్తకాలకు పైగా వంటల గురించి వ్రాసింది. 2007లో భారత ప్రభుత్వం తర్లా దలాల్ ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. కుకింగ్ ఫీల్డ్ లో ఈ బిరుదును అందుకున్న ఏకైక ఇండియన్ తర్లా దలాల్.
Video Advertisement
తాజాగా తర్లా దలాల్ బయోపిక్ తెరకెక్కించారు. ఈ మూవీ ‘తర్లా’ టైటిల్ తో జీ5 ఓటీటీలో రిలీజ్ అయ్యింది. టైటిల్ పాత్రలో బాలీవుడ్ నటి హుమా ఖురేషి నటించారు. ఈ మూవీకి పీయూష్ గుప్తా దర్శకత్వం వహించారు. జులై 7న రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
బయోపిక్ డ్రామాగా వచ్చిన “తర్లా ” ప్రస్తుతం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో హుమా ఖురేషి, షరీబ్ హష్మీ జంటగా నటించారు. పూర్ణేందు భట్టాచార్య, భారతీ అచ్రేకర్, వీణా నాయర్ తదితరులు నటించారు. కథ విషయనికి వస్తే, పెద్ద కలలు కనే మిడిల్ క్లాస్ అమ్మాయి తర్లా (హుమా ఖురేషి). జీవితంలో పెద్దగా ఏదైనా సాధించాలనుకునే ఆమెకి పెళ్లి జరగడంతో సినిమా మొదలవుతుంది. వృత్తిరీత్యా ఇంజనీర్ నలిన్ (షరీబ్ హష్మీ)ని తర్లా పెళ్లి చేసుకుంటుంది.
కాలేజ్‌కి వెళ్లే తర్లా పెళ్లి అనంతరం వంట చేయడం ఎలా నేర్చుకుంది. అందరికి ఆదర్శంగా నిలిచే విధంగా ఆ తరువాత తన సొంత వంటల పుస్తకాలతో, భర్త సపోర్ట్ తో ఎలా ఎదిగింది అనేది స్టోరీ. హుమా ఖురేషి తర్లా దలాల్ పాత్రలో మెప్పించింది. షరీబ్ హష్మీ భార్యకు సహాయం చేసే భర్త పాత్రలో మెప్పించాడు.
మూవీలోని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. పాటలు ఫర్వాలేదు. సింపుల్ కథను చక్కగా చూపించారు. సాలు కె థామస్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. రాకేష్ యాదవ్ ప్రొడక్షన్ డిజైన్ మరియు తస్నీమ్ ఖాన్ కాస్ట్యూమ్స్ 1960-80 కాలానికి సంబంధించినవి ఉపయోగించారు. తర్లాను ఫిల్ గుడ్ మూవీ అని చెప్పవచ్చు.
Also Read: “విరూపాక్ష” సినిమాలో అసలు పాయింట్ మర్చిపోయారుగా..? అది ఏంటంటే..?
End of Article