Ads
మలయాళం సినిమాలు చూసేందుకు థియేటర్లకు జనాలు రావట్లేదనే ఆందోళనల మధ్య పెద్దగా ప్రమోషన్ లేకుండా ‘2018’ సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. రిలీజ్ అయిన మొదటి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది.
Video Advertisement
సాయంత్రానికి కేరళ మొత్తం థియేటర్లు హౌస్ ఫుల్ షోలతో నిండిపోయింది. జూడ్ ఆంథోనీ జోసెఫ్ తెరకెక్కించిన ‘2018’ చిత్రం మలయాళ ఇండస్ట్రీ నెలరోజులుగా పడుతున్న ఆందోళనను కేవలం మూడు రోజుల్లోనే పోగొట్టింది. మరి అంతగా ఈ చిత్రంలో ఆకట్టుకున్న విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
2018 (అందరూ హీరోలే) ఈ చిత్రం ఎమోషనల్ సర్వైవల్ స్టోరీ. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2018లో కేరళ చరిత్రలోనే అత్యంత దారుణమైన వరదలు వచ్చాయి. వరదల వల్ల ప్రత్యక్షంగా బాధలు అనుభవించిన ప్రజలు, దాని బారిన పడిన వారు ఇప్పటికీ ఆ గాయాల భరిస్తున్నారు. కొందరు ప్రాణాలు, మరికొందరు ఇళ్లు, మరికొందరు జీవనోపాధి కోల్పోయారు. అయినా మానవత్వంతో అందరూ కలిసి ఈ కష్టం నుండి బయటపడ్డానికి సహాయం చేయడానికి చేతులు కలిపారు.
ఇదే విషయాన్ని దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్, 2018 లో చూపించే ప్రయత్నం చేసారు. ఈ మూవీ కథ అరువిక్కుళం అనే గ్రామంలో మొదలవుతుంది. ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ చూపించి ఆర్మీని వదిలి, దుబాయ్‌కి వెళ్లి బ్రతకలనుకునే పాత్రలో టొవినో థామస్. లాల్, నారాయణ్, ఆసిఫ్‌లతో జాలర్ల కుటుంబం. ఒక గర్భిణీ స్త్రీ, అంగ వైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులు, ఒక అంధుడు ఇలా అనేక పాత్రలు ఉన్నాయి. నెమ్మదిగా, రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండటం. కొన్ని గంటల్లో పరిస్థితి వర్షాలతో కేరళ రాష్రం వరదలతో ముంచెత్తడం. ఆ క్రమంలో వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి రెస్క్యూ టీమ్ తో పాటు మత్స్యకారులు సాయం చేయడం, స్థానికులు అందించిన సహాయం, హెలికాప్టర్ రెస్క్యూ, దాదాపు ప్రతిదీ, అప్పటి పరిస్థితులను కళ్ళ ముందుకు తెస్తుంది. ఈ చిత్రంలో టోవినో థామస్, లాల్, ఆసిఫ్ అలీ, ఇంద్రన్స్, నరేన్, కుంచకో బోబన్, అపర్ణ బాలమురళి వంటి స్టార్స్ నటించారు. వారి నటన పై ప్రశంసలు కురుస్తున్నాయి. మే 5 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మల్టీప్లెక్స్‌లలో తక్కువగా, చిన్న స్క్రీన్‌లలో సినిమా మొదటి షో నుండి ప్రదర్శించడం ప్రారంభమైంది. అయితే మౌత్ టాక్ తో సాయంత్రానికి మల్టీప్లెక్స్‌లు అన్నిట్లోనూ ఈ మూవీ వేశారు. టిక్కెట్లు దొరక్క తిరిగొచ్చిన వారు కూడా చాలా మంది ఉన్నారు. దీనితో కేరళ అంతటా అదనపు షోలు కూడా వేశారు.
తెలుగులో కూడా ఈ సినిమాని డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఇప్పుడు ఆస్కార్ అవార్డులకి భారతదేశ నుండి అధికారిక ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాగా 2018 సినిమా ఎంపిక అయ్యింది. వసూళ్ల పరంగా మొత్తం ఓపెనింగ్ వీకెండ్ గ్రాస్ 18 కోట్లకు పైగా ఉంటుంది. 2018 మలయాళం సినిమా అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్ చేసిన సినిమాలలో ఒకటిగా నిలిచింది.
Also Read: RRR గురించి ఈ 9 ఆసక్తికరమైన విషయాలు తెలుసా..?
End of Article