Ads
కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ కన్నడ సినిమా సప్త సాగరదాచె ఎల్లో. ఈ చిత్రానికి హేమంత్ ఎమ్ రావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయకగా నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 1న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
Video Advertisement
మ్యూజికల్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా కన్నడ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 777 చార్లీ మూవీతో ఆకట్టుకున్న రక్షిత్ శెట్టి నటించిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన కన్నడ సినిమా సప్త సాగరదాచె ఎల్లో. ఈ మూవీ అందమైన ఎమోషనల్ ప్రేమకథ అని చెప్పవచ్చు. కథ విషయానికి వస్తే, మను (రక్షిత్ శెట్టి) శేఖర్ గౌడ (అవినాష్) అనే బడా వ్యాపారవేత్త దగ్గర కారు డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. మను లవర్ ప్రియ (రుక్మిణి వసంత్) గాయని కావాలని ప్రయత్నాలు చేస్తుంటుంది. ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్న మను, ప్రియలు వివాహం చేసుకొని కొత్త లైఫ్ ను ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. అయితే ప్రియకు సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది.
మను ఓనర్ కుమారుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఒక వ్యక్తి మరణిస్తాడు. అప్పుడు శేఖర్ గౌడ పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని, త్వరగా జైలు నుంచి విడిపిస్తానని మనుకి హామీ ఇవ్వడంతో, మను యాక్సిడెంట్ తానే చేసినట్టుగా ఒప్పుకుని జైలుకు వెళతాడు. ప్రియ ఎంత వారించినా వినకుండా, వచ్చిన డబ్బుతో తమకోసం ఇల్లు కట్టుకోవచ్చని ప్రియకు చెప్పి జైలుకు వెళ్తాడు. కానీ అతను జైలుకి వెళ్ళాక బెయిల్ దొరకకపోగా, గుండెపోటుతో శేఖర్ గౌడ మరణిస్తాడు. మను బయటికి వచ్చాడా? మనును జైలు నుంచి విడిపించడానికి ప్రియ ఏం చేసింది? జైలులో మనుపై సోమ గ్యాంగ్ పగను ఎందుకు పెంచుకుంది? అసలు మను జైలు నుండి బయటికి వచ్చాడా? లేదా అనేది మిగిలిన కథ. మూవీ జైలు నేపథ్యంలో సాగుతుంది. చేయని నేరానికి జైలుకి వెళ్ళిన యువకుడు దాని నుండి బయటపడటం కోసమే కాకుండా తన ప్రేయసిని కలవడానికి పడే బాధను దర్శకుడు హృద్యంగా తెరపై చూపించారు.
End of Article