అక్కడ సూపర్ హిట్… ఇప్పుడు రీమేక్ కూడా చేస్తున్నారు..! ఈ సినిమా చూశారా..?

అక్కడ సూపర్ హిట్… ఇప్పుడు రీమేక్ కూడా చేస్తున్నారు..! ఈ సినిమా చూశారా..?

by kavitha

Ads

హృదయ కాలేయం మూవీతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యాక్టర్ సంపూర్ణేష్ బాబు. మొదటి చిత్రంతోనే ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత  కొబ్బరి మట్ట మూవీ సంపూర్ణేష్ బాబుకు పేరు తెచ్చింది. చాలా కాలం తరువాత తాజాగా తన కొత్త సినిమాని ప్రకటించాడు.

Video Advertisement

మార్టిన్ లూథ‌ర్ కింగ్ అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ మూవీ తమిళ మూవీకి రీమేక్. కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు లీడ్ రోల్ లో నటించిన ‘మండేలా’ సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కనుంది. అయితే ‘మండేలా’ మూవీ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సంపూర్ణేష్ బాబు నటిస్తూన్న లేటెస్ట్ మూవీకి ‘మార్టిన్ లూథ‌ర్ కింగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ  ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌ ఆడియెన్స్ లో క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే ఈ మూవీ తమిళ నటుడు యోగిబాబు నటించిన  ‘మండేలా’ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతోంది. మండేలా మూవీకి రెండు నేషనల్  అవార్డ్స్ వచ్చాయి. అంతేకాకుండా పలు విభాగాల్లో సైమ, ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఈ చిత్రానికి వచ్చాయి. ఈ చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం మడోన్ అశ్విన్ ఉత్తమ దర్శకుడిగా నేషనల్ అవార్డ్, సైమ, ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు.
మండేలా మూవీ కథ విషయనికి వస్తే, రెండు రాజకీయ పార్టీల మధ్య జరిగే గ్రామ పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. తమిళనాడులోని సూరంగుడి అనే చిన్న గ్రామంలో హీరో యోగిబాబు మంగలిగా పనిచేస్తూ  జీవనం సాగిస్తుంటాడు. అతని దగ్గర ఒక అబ్బాయి సాయంగా ఉంటాడు. ఊర్లోనివాళ్లు యోగిబాబును తమకు నచ్చిన పేర్లతో పిలుస్తూ, తమ పనులను చేయించుకుంటుంటారు. ఆ గ్రామ పెద్దకు ఇద్దరు భార్యలు. వారు వేరు వేరు కులాలకు చెందినవారు. గ్రామంలో కూడా రెండు కులాలవారు వేరు వేరుగా జీవిస్తుంటారు.
గ్రామ పెద్దకు ఇద్దరు కుమారులు. స్థానిక ఎలెక్షన్స్ ప్రకటన వస్తుంది. ఆ ఎలెక్షన్స్ లో గ్రామ పెద్ద కొడుకులు రెండు కులాలకు ప్రతినిధులుగా నిలబడతారు. యోగిబాబు ఆధార్‌కార్డు కావాలని పోస్టాఫీసులో ఒక ఉద్యోగిని కోరుతాడు. ఆమె యోగిబాబుకి నెల్సన్‌ మండేలా అని పేరుతో ఓటర్ల లిస్ట్ లో పేరు రిజిస్టర్ చేస్తుంది. ఆ తరువాత నెల్సన్‌ మండేలా ఓటు కీలకంగా మారడంతో ఇద్దరు ప్రతినిధులు తమకే ఓటు వేయాలని మండేలా చుట్టూ తిరుగుతుంటారు. ఈ క్రమంలో మండేలాకు ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరికి మండేలా ఓటు ఎవరికి వేశాడనేది మిగిలిన కథ.

Also Read: హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య ఎందుకు చేసుకుంది..? కారణం ఇదేనా..?

 

 


End of Article

You may also like