Ads
కోలీవుడ్ హీరో ఉదయనిధి స్టాలిన్ నటించిన చిత్రం ‘మామన్నన్’. ఈ చిత్రానికి డైరెక్టర్ మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. ఫహద్ ఫాజిల్, వడివేలు ముఖ్యమైన పాత్రలలో నటించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.
Video Advertisement
పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్ చిత్రాలతో హిట్స్ అందుకున్న మారి సెల్వరాజ్ ‘మామన్నన్’ మూవీని అదే పంథాలో రూపొందించాడు. ఈ చిత్రం గత సంవత్సరం జూన్ 29 నాడు విడుదల అయ్యింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడమే కాకుండా, ఉదయనిధి స్టాలిన్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించింది.
ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ నటించిన ‘మామన్నన్’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అటు విమర్శకుల ప్రశంసలతో పాటు ఆడియెన్స్ ప్రశంసలు అందుకుంటూ దూసుకెళ్లింది. పోస్టర్స్ తోనే మూవీ పై అందరి దృష్టి పడేలా చేశాడు డైరెక్టర్ మారి సెల్వరాజ్. హాస్యనటుడు వడివేలుని ఈ చిత్రంలో చూపించిన తీరు ఆకట్టుకుంటుంది.
ఇక ఈ సినిమా స్టోరి ఏమిటంటే కాశీపురం అనే ఊరిలో మామన్నన్ (వడివేలు) ఎమ్మెల్యేగా కొనసాగుతుంటాడు. మామన్నన్ కుమారుడు అయిన ఆదివీరన్ (ఉదయనిధి స్టాలిన్) అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి. పేద విద్యార్థుల కోసం లీల (కీర్తి సురేష్) ఉచిత కోచింగ్ సెంటర్ ను నడుపుతూ ఉంటుంది. రూలింగ్ పార్టీ లీడర్ రత్నవేలు (ఫహద్ ఫాజిల్) వల్ల లీలకు సమస్యలు ఏర్పడతాయి. ఆ సమయంలో లీలకు అండగా ఆదివీరన్, మామన్నన్ లు ఉంటారు. వాళ్ళిద్దరు రత్నవేల్ ని ఎలా అడ్డుకున్నారు అనేది మిగతా కథ.
దర్శకుడు మారి సెల్వరాజ్ చిత్రాలన్ని దాదాపు పేద ధనిక అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతాయి. మామన్నన్ సినిమా కూడా అలాంటి స్టోరీతోనే వచ్చింది. ఈ సినిమాలో పొలిటికల్ టచ్ కూడా ఇచ్చాడు. ప్రధమార్ధంలో క్యారెక్టర్ల పరిచయం, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. ఇక ద్వితీయార్ధం రొటీన్ ఫీల్ ను కలగచేస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. ద్వితీయార్ధం ఇంకొంచెం బెటర్ గా తీసి ఉంటే మూవీ ఫలితం మరో రేంజ్ లో ఉండేది. రెహమాన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది. ఫహద్ ఫాజిల్, వడివేలు నటన ఆకట్టుకుంటుంది. తెలుగులో నాయకుడు పేరుతో ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. అందులో చూసిన వాళ్ళందరూ కూడా ఈ సినిమాని పొగుడుతున్నారు.
Also Read: ARTHAMAYYINDHA ARUN KUMAR : “ఆహా” లో రిలీజ్ అయిన ఈ సిరీస్ అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
End of Article