Ads
గత వారం రోజులుగా దగ్గు విపరీతంగా సతాయిస్తుందని, అసలే కరోనా కాలం ఎందుకైనా మంచిది టెస్టు చేయించుకుంటా అని మొన్న మా ఫ్రెండ్ గాంధికి వెళ్లింది. పొద్దున పదింటికి వెళ్లింది సాయంత్రం ఆరింటికి కరోనా లేదంటా అంటూ బయటికి వచ్చింది. అంత టైమ్ పాటు వెయిట్ చేయలేక ఎక్కడ నాకు కరోనా వస్తుందో అని భయం వేసింది.
Video Advertisement
టెస్టు చేయడానకి ఇంత సేపా, ఒకవేళ కరోనా లక్షణంగా గుర్తిస్తే ఆ వ్యక్తులని ఐసోలేషన్లో పెట్టి రిపోర్టలను మరిన్ని టెస్టుల కోసం పూణె పంపుతున్నారు. ఇక్కడ ఇంత తతంగం ఉంటే, మరి ఎయిర్పోర్ట్ లో ఏంటి మామూలుగా టెస్టు చేసి కరోనా లేదని చెప్పి పంపించేశారు అని డౌటొచ్చింది. అదే డౌట్ మీకూ వచ్చిందా.
ఎయిర్పోర్ట్ లో బయటి దేశాలనుండి వచ్చే వారికి చేతిలో ఒక పరికరం పట్టుకుని , దాన్ని వారి చుట్టూ తిప్పి టెస్టు చేసి పంపేస్తున్నారు. దాన్ని ధర్మల్ ఇమోజింగ్ కెమెరాలు అంటారు. ఇది కరోనా లక్షణాలను గుర్తిస్తుందా? అసలు దీని పనేంటో తెలుసా?
సాధారణ కెమెరాలు కాంతిని గ్రహించి మన ఫోటోలని తీస్తాయి. ఈ ధర్మల్ ఇమేజింగ్ కెమెరాలు మన ఉష్ణోగ్రతని గ్రహించి పని చేస్తాయి. ఈ కెమెరాల్లో ఉండే ధర్మామీటర్లు చాల శక్తిమంతమైనవి, సున్నితమైనవి. అవి డిగ్రీలో పదవవంతు ఉష్ణోగ్రతని కూడా కనిపెట్టగలవు. సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రత 36-37 డిగ్రీలు ఉంటుంది. అంతకుమించి కొంచెం ఎక్కువ ఉన్నా ఈ ధర్మల్ ఇమేజింగ్ కెమెరా పసిగడుతుంది.
కరోనా లక్షణాల్లో జ్వరం కూడా ఒక లక్షణం కదా. ధర్మల్ ఇమేజింగ్ కెమెరాలు మనిషికి కరోనా సోకిందా లేదా అనేది గుర్తించలేవు. కేవలం మనిషి ఉష్ణోగ్రతని గుర్తిస్తాయి. అందులో ఏమైనా తేడాలుంటే అప్పుడు ఆ వ్యక్తిని ఇతర టెస్టులకోసం హాస్పిటల్ కి పంపిస్తారు. అది ఎయిర్పోర్టులో తొందరగా జరిగే కరోనా టెస్టుల వెనుక ఉన్న అసలు రహస్యం.
End of Article