Ads
సినిమాలతో సమానంగా వెబ్ సిరీస్ కి కూడా పాపులారిటీ పెరిగిపోయింది. తెలుగులో కూడా వెబ్ సిరీస్ డిమాండ్ మామూలుగా లేదు. ఎంతో మంది పెద్ద పెద్ద నటీనటులు కూడా వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. అలా ప్రముఖ హీరో జేడీ చక్రవర్తి కూడా వెబ్ సిరీస్ లో నటించారు.
Video Advertisement
ఎన్నో సినిమాలతో తన నటనతో అలరించిన జేడీ చక్రవర్తి హీరోగా నటించిన పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్ దయ ఇవాళ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయ్యింది. ఇందులో జేడీ చక్రవర్తితో పాటు ఈషా రెబ్బ, రమ్య నంబీసన్, బబ్లు పృథ్వీరాజ్ తో పాటు ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీనటులు నటించారు.
ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ కూడా ఇందులో ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఇంక సిరీస్ విషయానికి వస్తే, దయ అనే ఒక చేపలు ట్రాన్స్పోర్ట్ చేసే వ్యాన్ డ్రైవర్ పాత్రలో జేడీ చక్రవర్తి నటించారు. జేడీ చక్రవర్తి భార్య అలివేలు పాత్రలో ఈషా రెబ్బ నటించారు. ఒక రోజు పని మీద బయటికి వెళ్లిన దయ అనుకోకుండా ఒక ప్రమాదంలో ఇరుక్కుంటాడు. అతని బండిలో ఒక శవం కనిపిస్తుంది. మరొక వైపు కవిత అనే ఒక జర్నలిస్ట్ పాత్రలో రమ్య నంబీసన్ నటించారు.
కవిత హైదరాబాద్ నుండి కాకినాడ పోర్ట్ కి అక్కడి లోకల్ ఎమ్మెల్యే అయిన పెన్మెత్స పరశురామరాజుని కలవడానికి వెళ్తుంది. ఎమ్మెల్యేగా బబ్లు పృథ్వీరాజ్ నటించారు. కానీ కవిత భర్త కౌశిక్ పాత్ర పోషించిన కమల్ కామరాజు కవిత మిస్సింగ్ అని కంప్లైంట్ ఇస్తాడు. అసలు దయ బండిలో ఉన్న శవం ఎవరిది? ముఖ్యమంత్రితో ఉన్న మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరి కవిత ఎమ్మెల్యేని ఎందుకు కలిసింది? కౌశిక్ అలా ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సిరీస్ చూడాల్సిందే.
ఇటీవల కాలంలో కొన్ని వేరు వేరు కథలు ఒక సినిమాలాగా, లేకపోతే ఒక సిరీస్ లాగా చూపించడం అనేది ఒక ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు దయ సిరీస్ కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యింది. మూడు వేరు వేరు కథలని ఈ సిరీస్ లో చూపించారు. ముందుకు వెళుతున్న కొద్ది ఒక్కొక్క ట్విస్ట్ బయటకి వస్తూ ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో ఉన్న నటీనటులు అందరూ కూడా అంతకుముందు చాలా సినిమాల్లో నటించిన అనుభవం ఉన్నవారు కాబట్టి అందరూ చాలా సులభంగా ఒక ఈజ్ తో చేశారు.
ఈషా రెబ్బ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా కూడా తనకి ఉన్న పాత్రలో ఒక గర్భవతి మహిళగా బాగా నటించారు. అంతే కాకుండా యాంకర్ విష్ణుప్రియ పోషించిన షబానా పాత్ర కూడా చాలా బాగా డిజైన్ చేశారు. విష్ణు ప్రియ కూడా పాత్రకి తగ్గట్టుగా నటించారు. అయితే వీరందరూ మాత్రమే కాకుండా ఈ సిరీస్ కి మరొక పెద్ద హైలైట్ అయిన పాత్ర జోష్ రవి పాత్ర. చాలా కాలం తర్వాత జోష్ రవికి ఒక నటనకి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. ఈ పాత్రలో జోష్ రవి చాలా బాగా నటించారు.
దర్శకుడు ప్రతి పాత్రని తెరపై చూపించిన విధానం బాగుంది. ఎక్కడ హడావిడి లేకుండా ప్రతి చిన్న విషయాన్ని కూడా వివరంగా చూపించారు. దాంతో సిరీస్ చూస్తున్న ప్రేక్షకులకి ఒక్కొక్క పాత్రకి సంబంధించి ఒక అవగాహన వస్తుంది. సిరీస్ ముగించిన విధానం చూస్తే దీనికి రెండవ సీజన్ కూడా ఉంది అని అర్థం అవుతోంది. అయితే రామ్ గోపాల్ వర్మ సత్య, ఈ సిరీస్ లో ఉన్న దయ కి ఏమైనా లింక్ ఉంది ఏమో అనే ఒక అనుమానం కూడా వస్తుంది. మరి అసలు కథ ఏంటో తెలుసుకోవాలి అంటే రెండవ సీజన్ వరకు ఆగాల్సిందే.
watch trailer :
ALSO READ : “జూనియర్ ఎన్టీఆర్” నుండి “సాయి పల్లవి” వరకు… సినిమాల్లో “చనిపోయే పాత్రలు” చేసిన 10 యాక్టర్స్..!
End of Article