Home News వైరల్ అవుతున్న ఈ “వాట్సాప్” చాట్ వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా..? ఉద్యోగానికి ఒక్క రోజు ముందు ..?

వైరల్ అవుతున్న ఈ “వాట్సాప్” చాట్ వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా..? ఉద్యోగానికి ఒక్క రోజు ముందు ..?

by Anudeep

ఒక ఉద్యోగార్థి తాను ఉద్యోగానికి ఎన్నికైన ఒక కంపెనీకి పంపిన వాట్స్ వాట్సాప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక స్టార్ట్ అప్ వ్యవస్థాపకుడు చేసిన ఈ ట్వీట్ కారణంగా ఉద్యోగులు, యజమానులు ఒకరిపట్ల ఒకరు ఎలాంటి గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలనే అంశంపై సామాజిక మాధ్యమాల్లో ఎవరికి వారు తమ వాదనను వినిపిస్తున్నారు.

ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థ అయిన ‘ఈజ్ మై ట్రిప్’ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టి చేసిన ట్వీట్‌తో ఈ చర్చ మొదలైంది. తమ కంపెనీలో ఇంటర్వ్యూలో పాల్గొని, ఉంద్యోగానికి ఎంపికైన ఒక వ్యక్తి పంపిన మెసేజ్ అది.

what is this whatsapp chat which goes viral on internet
‘నాకు మరో జాబ్ ఆఫర్ రావడం వల్ల మీ సంస్థలో చేరకూడదని నిర్ణయించుకున్నా’ అని పేర్కొంటూ సదరు అభ్యర్థి ప్రశాంత్ పిట్టికి మెసేజ్ పంపారు. ‘ఈజ్ మై ట్రిప్’ కంపెనీలో జాయిన్ కావాల్సిన రోజునే ఆ వ్యక్తి, తాను చేరలేనంటూ సందేశాన్ని పంపించారు. ఈ చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ప్రశాంత్ ట్విట్టర్ లో పంచుకున్నారు. కంపెనీలో జాయిన్ అవ్వాల్సిన సమయానికి ఇలా చెప్పడం వల్ల కంపెనీ సమయం, రిసోర్స్ లు వేస్ట్ అవుతాయని ప్రశాంత్ వ్యాఖ్యానించారు. ఇలాంటి పనుల వల్ల ప్రతిభావంతులైన వేరే అభ్యర్థులు నష్ట పోతున్నారని ఆయన పేర్కొన్నారు.

what is this whatsapp chat which goes viral on internet
ఈయన ట్వీట్ పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ప్రస్తుతం కంపెనీలు ఉద్యోగులను తొలగించడాన్ని, జాబ్ ఆఫర్లను రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ కొందరు ట్విటర్ యూజర్లు సదరు అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. ఉద్యోగులను తొలిగించడాన్ని కంపెనీలు సమర్థించుకుంటే, దీన్ని కూడా అంగీకరించాల్సిందే అని అంటున్నారు.

”ఉద్యోగుల్ని తొలిగించడం ‘తప్పు’ అవుతుంది. ఒకవేళ ఆఫర్ లెటర్ పంపిన తర్వాత చివరి క్షణంలో అభ్యర్థుల్ని కంపెనీలు తిరస్కరిస్తే అది సరైనదేనా, ఇది ఆమోదయోగ్యమేనా, కాదు కదా?” అని ప్రశాంత్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.
మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చేయాలి ? అనే అంశంపై కూడా చర్చలు జరిగాయి. మరోవైపు ప్రశాంత్ పిట్టికి, వ్యాపారవేత్త అష్నీర్ గ్రోవర్ మద్దతు పలికారు.

You may also like