Home Filmy Adda సినిమాల్లోకి రాకముందు కాంతార హీరో “రిషబ్ శెట్టి” ఇన్ని కష్టాలు పడ్డారా..? ఏం చేసేవారో తెలుసా..?

సినిమాల్లోకి రాకముందు కాంతార హీరో “రిషబ్ శెట్టి” ఇన్ని కష్టాలు పడ్డారా..? ఏం చేసేవారో తెలుసా..?

by Anudeep

రిషబ్ శెట్టి ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఈయన దర్శకత్వంలోనే రిషబ్ శెట్టి హీరో గానే తెరకెక్కిన చిత్రం కాంతార. కేవలం మౌత్ టాక్ ద్వారా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఏ అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాని అన్ని భాషలలో విడుదల చేశారు. ఇలా 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 300 కోట్లను రాబట్టినట్టు తెలుస్తోంది.

 

ఈ నేపథ్యం లో రిషబ్ శెట్టి గురించి అందరు చర్చించుకుంటున్నారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూ లో తన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో ఉద్యోగాలు చేస్తూ ఉండేవాడినని తెలిపారు. ఇంట్లో నాన్నను డబ్బులు అడగలేక ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించానని వెల్లడించారు.

what jobs rishab shetty done before his debut as director..

డిగ్రీ పూర్తి అయిన తర్వాత ఫిలిం మేకింగ్ పై కోర్స్ చేశా.. 2004 నుంచి 2014వ సంవత్సరం వరకు మినరల్ వాటర్ ప్లాంట్ లు వాటర్ క్యాన్లు అమ్ముతూ బిజినెస్ చేశానని,హోటల్ బిజినెస్ కూడా తాను చేశానని రిషబ్ శెట్టి వెల్లడించారు.

what jobs rishab shetty done before his debut as director..
సినీ పరిశ్రమలో క్లాప్ బాయ్, స్పాట్ బాయ్, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన తర్వాత 2016 లో ‘రికీ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. తర్వాత ఏడాది వచ్చిన ‘కిరిక్ పార్టీ’ చిత్రం తో సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు కాంతార చిత్రం తో అందరి దృష్టిని ఆకర్షించారు రిషబ్.

You may also like