రాత్రిపూట్ల వాట్సాప్ ని బంద్ చేస్తున్నారా? డబ్బులు కడితేనే అందుబాటులోకి తెస్తారా? నిజమెంత?

రాత్రిపూట్ల వాట్సాప్ ని బంద్ చేస్తున్నారా? డబ్బులు కడితేనే అందుబాటులోకి తెస్తారా? నిజమెంత?

by Anudeep

Ads

కొన్ని రోజుల క్రితమే దాదాపు ఏడుగంటల పాటు వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సర్వీస్ లు బంద్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఇది ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న ఘటన. సాంకేతిక సమస్యల కారణంగానే వీటి సర్వీసులు నిలిచిపోయినట్లు ఫేస్ బుక్ ఓనర్ మార్క్ జుకెర్బెర్గ్ వివరణ కూడా ఇచ్చారు.

Video Advertisement

whatsapp

ఈ క్రమంలో నెట్టింట్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఇకపై రాత్రి సమయాల్లో వాట్సాప్ ను బంద్ చేయాలనీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ఈ వార్త కధనం లో పేర్కొన్నారు. రాత్రి 11 30 గంటలనుంచి ఉదయం 6 30 గంటల వరకు వాట్సాప్ అందుబాటులో ఉండదని ఈ వార్తలు పేర్కొంటున్నాయి. ఆ సమయం లో కూడా వాట్సాప్ సర్వీస్ కావాలనుకుంటే అందుకోసం డబ్బులు చెల్లించాలంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఇవి కేవలం పుకార్లేనని కొట్టిపడేసింది. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ ద్వారా ట్విట్టర్ మాధ్యమంలో స్పందించింది.

 

 


End of Article

You may also like