Ads
బుధవారం నుంచి ప్రభుత్వం విధించిన రూల్స్ అమలు లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమం లో ఈ నిబంధనలను సడలించాలని కోరుతూ భారత ప్రభుత్వం పై వాట్సాప్ ఢిల్లీ హై కోర్ట్ లో పిటిషన్ వేసింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు సమాచారం అందించడానికి తోలి వేదికగా ఉన్నాయని.. ఈ క్రమం లో ఈ నిబంధనలు విధించడమనేది గోప్యతా హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని తెలియచెప్పాల్సింది గా వాట్సాప్ హై కోర్ట్ ను కోరినట్లు రాయిటర్స్ పేర్కొంది.
Video Advertisement
కేవలం కొన్ని కేసుల విషయమై సమాచారాన్ని ఛేదించడానికి వాట్సాప్ అవసరం ఉంటుంది. మిగిలిన విషయాలలో వినియోగదారుల భద్రతకు ముప్పు వాటిల్లదు. ఎందుకంటే.. సెండింగ్ లేదా రిసీవ్డ్ మెస్సేజెస్ అన్ని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ను కలిగి ఉంటాయి. వాట్సాప్ కు భారత్ లో 400 మిలియన్ల యూజర్స్ ఉన్నారు. అయితే.. వాట్సాప్ ఢిల్లీ హై కోర్ట్ ను ఆశ్రయించినట్లు రాయిటర్స్ నిర్ధారించలేదు.
End of Article