ఫేక్ వి ఫార్వార్డ్ చేయనివ్వకుండా వాట్సాప్ చెక్..! సరికొత్త ఫీచర్ ఇదే..!

ఫేక్ వి ఫార్వార్డ్ చేయనివ్వకుండా వాట్సాప్ చెక్..! సరికొత్త ఫీచర్ ఇదే..!

by Anudeep

Ads

ఎవరైతే ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేస్తారో వారికి కరోనా సోకాలి అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే అన్నారంటే, ఫేక్ మెసెజెస్ తో ఎంతగా విసిగిపోయుంటాం. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు మన తోడుంటే స్మార్ట్ ఫోన్లో రోజుకు కొన్ని వందల ఫేక్ మెసేజ్లు. సామాన్య జనాల్ని తప్పు దోవ పట్టిస్తుంటాయి. ఫేక్ మెసేజెస్ ని అరికట్టే యుద్దంలో భాగంగా వాట్సప్ తనవంతు సహాయాన్ని చేయబోతుంది. ఇకపై ఫార్వర్డ్ మెసేజెస్ ని కేవలం ఒకరికి మాత్రమే పంపించేలాగా కుదించబోతోంది.

Video Advertisement

 

వాట్సప్ లో ఇలాంటి మార్పు రావడం ఇది రెండోసారి , గతేడాదికి ముందు అన్లిమిటెడ్గా ఎంతమంది కాంటాక్ట్స్ ఉంటే అందరికి ఒకేసారి మెసేజ్ని ఫార్వర్డ్ చేసే అవకాశం ఉండేది..దాన్ని ఐదుగురికి మాత్రమే పంపేలా కుదించింది. ఇప్పటివరకు ఏదైనా మెసేజ్, ఫోటో మరియు వీడియోని ఐదు కాంటాక్ట్స్ కి పంపే విధంగా ఉండేది. కానీ  ఇప్పుడు కోవిడ్ -19 నేపధ్యంలో ఫార్వర్డ్ అవుతున్న ఫేక్ మెసేజెస్ ని నిర్మూలించడానికి ఆ ఐదు కాంటాక్ట్స్ ని కాస్తా ఒక్క కాంటాక్ట్ కి కుదించింది.. ఇది వెంటనే అమలు కాకపోయినప్పటికి, మరికొన్ని గంటల్లో అమల్లోకి రావచ్చు.

వాట్సప్ మొదలైన నాటి నుండి ఇప్పటివరకు ఎన్నో మార్పులు సంతరించుకుంది. గతేడాది ఫార్వర్డ్ లేబుల్ కూడా యాడ్ అయ్యేలా మార్పు చేసింది. ఫార్వర్డ్ చేయబడిన మెసేజ్ కి ఆటోమేటిక్ గా పైన ఫార్వర్డెడ్ అని కనపడేలా ఆ లేబుల్ ఉంటుంది. అదే విధంగా స్టాటస్లో వీడియోస్ విడిది కూడా ముప్పై సెకన్ల నుండి పదిహేను సెకన్లకు కుదించింది. ఫేక్ న్యూస్‌ను అడ్డుకోవడానికి ఇలాంటి అనేక ఫీచర్స్‌ని రిలీజ్ చేస్తోంది వాట్సప్. అందులో భాగంగానే ఇప్పుడు ఈ మార్పు చేస్తోంది.

వాట్సప్లో ఫార్వర్డ్ మెసేజెస్ ద్వారా వీడియోస్, ఫన్నీ మీమ్స్, ఎడ్యుకేటెడ్ రిలేటెడ్, జాబ్ రిలేటెడ్ మెసేజెస్ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఉపయోగపడినప్పటికి , వాటికంటే ఎక్కువగా ఫేక్ న్యూస్ ఫార్వర్డ్సే  జరుగుతున్నాయని, వాటిని నిరోధించాలంటే ఈ నిర్ణయం తీస్కోక తప్పట్లేదని వాట్సప్ యాజమాన్యం ప్రకటించింది. ఫేక్ గాళ్లకి ఈ విధంగా చెక్ పెట్టిన వాట్సప్, ఫేక్ మెసెజెస్ ద్వారా విసిగిపోయిన వారికి చాలా రిలీఫ్ ఇచ్చినట్టవుతుంది.


End of Article

You may also like