Ads
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ’. ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ తొలిసారిగా దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సీనియర్ నటీమణి సిమ్రన్ కీలక పాత్రలో నటించింది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో షారుఖ్, సూర్య కీలకపాత్రల్లో కనిపించారు.
Video Advertisement
ఈ సినిమా జూలై 1న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్‌లో రాకెట్రీ మూవీ జూలై 26న స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాకెట్రీ నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. రూ. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 40 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు సమాచారం.
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ సాధించిన విజయాలు, అతనిపై తప్పుడు ఆరోపణలు, అతను నిర్దోషి అని నిరూపించుకోవడానికి చేసిన పోరాటాన్ని రాకెట్రీ సినిమాలో చక్కగా చూపించారు. ఇందులో నంబి నారాయణన్ పాత్రలో మాధవన్ నటించారు.
End of Article