రాఖీ పండుగ తర్వాత సోదరి కట్టిన రాఖీ ను సోదరుడు తన చేతి నుండి ఎప్పుడు తీసివేయాలి?

రాఖీ పండుగ తర్వాత సోదరి కట్టిన రాఖీ ను సోదరుడు తన చేతి నుండి ఎప్పుడు తీసివేయాలి?

by Anudeep

Ads

మన హిందూ పంచాంగం ప్రకారం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణిమ జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఈ తిధి రెండు రోజులు రావడంతో చాలా ప్రదేశాల్లో ఈ పండుగను 11న జరుపుకుంటే మరికొన్ని చోట్ల 12న జరుపుకున్నారు. ఈ పవిత్రమైన పర్వదినాన
సోదరి తన సోదరుల క్షేమంగా ఉండాలని, అన్ని విషయాల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ వారి కుడి చేతి మణికట్టుకు రాఖీ కడతారు.

Video Advertisement

అలాగే అన్నదమ్ములు తమ అక్కాచెల్లెళ్లకు మంచి బహుమతులు ఇచ్చి వారు జీవితంలో ఎల్లవేళలా ఆనందంగా ఉండాలి అని ఆశీర్వదిస్తారు.

Also Read:   సీనియర్ ఎన్టీఆర్ నుండి తారక్ వరకు…ఈ 12 మంది టాలీవుడ్ జంటల “పెళ్లిపత్రికలు” ఓ లుక్ వేయండి.!

rakhi

మామూలుగా రాఖీ పండుగ రోజున రక్షాబంధన్ కట్టడం వరకు మాత్రమే చాలామందికి తెలిసిన విషయం. అయితే ఈ పండుగ పూర్తయిన తరువాత చేతికి కట్టిన రాఖిని సోదరుడు ఏ సమయంలో తీయాలి ……ఎప్పుడు తీయాలి ఎన్ని రోజులపాటు …….అలాగే చేతికి ఉంచుకోవాలి……ఇలాంటి విషయాలపై చాలామందికి అవగాహన లేదు. రాఖీ చేతికి కట్టడానికి మంచి సమయం , విధి విధానాల అవసరం ఎంత ఉంటుందో అలాగే చేతికి కట్టిన రాఖీ తీయడానికి కూడా నిర్దేశిత సమయం పాటించవలసిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం

Rakhi Pournami

మన గ్రంథాల ప్రకారం చాలా వరకు రాఖీ కట్టించుకోవడానికి నిర్దిష్ట సమయం అంటూ పాటించాల్సిన అవసరం లేదు. అది వారి వీలును బట్టి పరిస్థితిని బట్టి రాఖీ పౌర్ణమి రోజు ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా కట్టవచ్చు. కానీ కొన్ని ప్రదేశాల్లో మాత్రం కట్టిన రాఖీని విప్పడానికి ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి. మహారాష్ట్రలో రక్షాబంధన్ రోజు నుంచి 15 రోజులపాటు సోదరుడు తన చేతి కి కట్టించుకున్న రాఖీని ధరించి తీరాలి. ఆ తరువాత మహారాష్ట్రీయులు పోలా అనే పండుగను జరుపుకుంటారు. మరియు అదే శుభసమయానికి మరాఠీ రైతులు లార్డ్ మార్బోట్ దేవ్ ను ,ఎద్దులను ప్రార్థిస్తారు.

కొన్ని ప్రదేశాల్లో రాఖీని వారం రోజులపాటు ఉంచుకొని తర్వాత మంచి సమయం చూసి తీసేస్తారు. మరికొందరైతే తమ వీలుని పట్టి ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు లేదా వచ్చే సంవత్సరం వరకు తమ సోదరి గుర్తుగా రాఖీని అలాగే చేతికి ధరించి ఉంటారు. మరికొన్ని ప్రదేశాలలో సోదరుడికి రాఖీ కట్టేంతవరకు సోదరి ఉపవాసాన్ని పాటిస్తుంది. ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతుల్లో జరుపుకున్నప్పటికీ రాఖీ పండుగ ముఖ్య ఉద్దేశం మాత్రం అన్నా చెల్లెలు మధ్య ప్రేమ మరియు అనుబంధం.
Also Read: బాలయ్యకి చెల్లెలి పాత్ర ఇచ్చారని కన్నీరు పెట్టుకున్న నటి లయ.. ఎందుకో తెలుసా??


End of Article

You may also like