Ads
ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒక రోజు జబర్దస్త్ లో అనసూయ యాంకర్ గా మనల్ని అలరిస్తుంటే, మరొక రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు.
Video Advertisement
ఈ ప్రోగ్రాం ద్వారా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర ఇంకా ఎంతో మంది ఉన్నారు. వీరిలో ఒకరు రాతకొండ ప్రసాద్ అలియాస్ కిరాక్ ఆర్పీ. డిఫరెంట్ మేనరిజమ్స్ తో, డిఫరెంట్ గెటప్స్ తో ఎంతో కాలం జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించారు కిరాక్ ఆర్పీ.
కేవలం ఈ రెండు షోస్ లో మాత్రమే కాకుండా ఏదైనా స్పెషల్ అకేషన్ అప్పుడు జరిగే షోస్ లో కూడా ఎంటర్టైన్ చేసేవారు కిరాక్ ఆర్పీ. అయితే, గత కొద్ది రోజులుగా ఆర్పీ జబర్దస్త్ లో రావట్లేదు. ఆ తర్వాత జీ తెలుగు లో టెలికాస్ట్ అయిన అదిరింది షోలో కనిపించారు. ప్రస్తుతం అయితే ఆర్పీ టెలివిజన్ షోస్ లో ఎప్పుడో ఒకసారి తప్ప ఎక్కువగా కనిపించడం లేదు. అందుకు కారణం ఏమిటో చాలా మందికి తెలియదు.
అసలు కిరాక్ ఆర్పీ జబర్దస్త్ లో కనిపించకపోవడానికి కారణం ఏంటంటే, ఆర్పీ ఇప్పుడు దర్శకత్వం వైపు దృష్టి పెట్టారట. ప్రస్తుతం ఒక సినిమాని డైరెక్ట్ చేసే పనిలో ఉన్నారు ఆర్పీ. ఈ సినిమాలో జెడి చక్రవర్తి హీరోగా నటిస్తున్నారు. కరోనా సమయంలోనే ఈ సినిమా షూటింగ్ మొదలైందట.
ఒక సందర్భంలో జెడి చక్రవర్తి ఆర్పీ గురించి మాట్లాడుతూ, “ఆర్పీ చాలా మంచి కథ చెప్పారు అని, ప్రేక్షకులందరూ సినిమా చూసిన తర్వాత సర్ప్రైజ్ అవుతారు అని, డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు” అని ప్రశంసించారు. 2019 లో సప్తగిరి హీరోగా నటించిన వజ్ర కవచధర గోవిందా సినిమాలో ఆర్పీ నటించారు. అంతే కాకుండా జెడి చక్రవర్తి హీరోగా నటించిన ఎంఎంఓఎఫ్ (MMOF) అనే సినిమాలో కూడా ఉన్నారు కిరాక్ ఆర్పీ. ఈ సినిమా ఫిబ్రవరి 26 వ తేదీన విడుదల అవ్వబోతోంది.
End of Article