Janani: “జనని” సాంగ్ లో అందరూ ఉన్నారు.. కానీ ఆ హీరోయిన్ లేదేంటి..? ఆ చెయ్యి ఎవరిది..?

Janani: “జనని” సాంగ్ లో అందరూ ఉన్నారు.. కానీ ఆ హీరోయిన్ లేదేంటి..? ఆ చెయ్యి ఎవరిది..?

by Anudeep

Ads

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

Video Advertisement

ఈ సినిమా విడుదల తేదీని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కాబోతోంది. కొద్ది సేపటి క్రితమే ఆర్ ఆర్ ఆర్ నుంచి జనని సాంగ్ విడుదల అయ్యింది.

olivia in rrr

అయితే.. ఈ పాట విడుదల అవ్వడం ఆలస్యం అన్నట్లు సోషల్ మీడియాలో సందడి మొదలైంది. అయితే.. ఈ పాట చాలా ఎమోషనల్ గా సాగుతుంది. అందరి హృదయాలను తాకుతోంది. కానీ, ఈ పాట చూసిన అందరి మనసులని తొలిచేసే ప్రశ్న.. ఒలీవియా ఎక్కడ..? ఈ పాట విజువల్స్ లో ఎక్కడా ఒలీవియా కనిపించదు. కానీ ఓ చోట మాత్రం లో ఒక ఆడవారి చెయ్యిని చూపించారు.

unnoticed details in janani rrr song

ఆ చేతిలో కాయిన్స్ ఉంటాయి. చేతికి ఒక మోడరన్ గా ఉన్న మెటల్ బ్యాంగిల్ ఉంటుంది. సినిమాలో నటించిన అలియా, శ్రియ ఇద్దరు మట్టి గాజులే వేసుకుని భారతీయతకు అద్దం పడుతుంటారు. అయితే.. ఈ చెయ్యి ఎవరిది..? ఒలీవియాదా..? ఆ చేతిలో ఉన్న కాయిన్స్ మాత్రం అచ్చంగా ఇండియన్ కాయిన్స్. 1905 లో ముద్రించబడిన కాయిన్స్. ఆ చెయ్యి ఒలీవియాదే అయితే.. ఆమె చేతిలో ఇండియన్ కాయిన్స్ ఎందుకు ఉన్నట్లు..? ఇవన్నీ సస్పెన్స్ లు వీడాలంటే.. ఆర్ ఆర్ ఆర్ సినిమాను చూడాల్సిందే.


End of Article

You may also like