‘AMB’ మల్టీప్లెక్స్ ముందు ‘AAA’ మల్టీప్లెక్స్ తేలిపోయిందా ..?

‘AMB’ మల్టీప్లెక్స్ ముందు ‘AAA’ మల్టీప్లెక్స్ తేలిపోయిందా ..?

by kavitha

Ads

ఏషియన్ సినిమాస్ ప్రముఖ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఏషియన్ సంస్థ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఆధునిక హంగులతో ‘ఏఎంబీ’ మల్టీప్లెక్స్ ను గచ్చిబౌలిలో నిర్మించారు.

Video Advertisement

ఇటీవల ఏషియన్ సంస్థ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ‘ఎఎఎ’ సినిమాస్ పేరుతో నిర్మించిన మల్టీప్లెక్స్ ను ప్రారంభించారు. అయితే ఈ రెండు మల్టీప్లెక్స్ లను పోలుస్తూ, రెండింటిలో ఏఎంబీ సినిమాస్ బెటర్ అని అంటున్నారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. amb-and-aaa-cinemasహైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లలో ఏఎంబీ సినిమాస్ ఒకటి. ఏఎంబీ మల్టీప్లెక్స్ కు ఆడియెన్స్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ మల్టీప్లెక్స్ లో రిలీజ్ అయిన సినిమాలకు బుకింగ్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. మహేష్ ఇమేజ్ ఈ మల్టీప్లెక్స్ కు ప్లస్ గా మారింది. ఏఎంబీ మల్టీప్లెక్స్ లో చాలా ప్రత్యేకతలు ఉండటంతో కొత్త సినిమాల ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. అలాగే చిత్రాలకు సంబంధించిన చిన్నచిన్న వేడుకలను కూడా ఏఎంబీ మల్టీప్లెక్స్ లో నిర్వహిస్తున్నారు.
ఇటీవల అమీర్ పేట్ లో అల్లు అర్జున్ ‘ఎఎఎ’ సినిమాస్ ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో ఎఎఎ మల్టిప్లెక్స్ ను నిర్మించారు. కొత్తగా నిర్మించిన ఎఎఎ సినిమాస్ ను ఏఎంబీ సినిమాస్ తో పోలుస్తూ సోషల్ మీడియాలో నెటిజెన్లు తమ అభిప్రాయాలను చెప్తున్నారు. ఎఎఎ మల్టీప్లెక్స్ బాగానే ఉన్నప్పటికీ, ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ ఓ మెట్టు పైనే ఉందని ఈ రెండు మల్టీప్లెక్స్ లలో మూవీస్ చూసిన వారు కామెంట్లు చేస్తున్నారు. ఎఎఎ సినిమాస్ మల్టీప్లెక్స్ లో ఉన్న ఎల్ఈడీ లైట్ల వెలుగు కళ్ళకు ఇబ్బంది కలిగేలా ఉందని అంటున్నారు. ఇందులో ఉన్న చిన్నచిన్న లోపాలను సరిదిద్దితే ఎఎఎ సినిమాస్ కు ఎదురు ఉండదని కొంతమంది కామెంట్లు  చేస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్ అమీర్ పేట్ లో నిర్మించడం ప్లస్ గా మారింది.

Also Read: తమ సినిమాల్లో తామే నటించిన 11 మంది డైరెక్టర్లు…వీరిలో ఎంతమందిని మీరు గమనించారు?


End of Article

You may also like