వైరల్ అవుతున్న ఘానా డాన్సర్స్ వీడియో..! వారి గురించి ఈ నిజాలు మీకు తెలుసా?

వైరల్ అవుతున్న ఘానా డాన్సర్స్ వీడియో..! వారి గురించి ఈ నిజాలు మీకు తెలుసా?

by Anudeep

Ads

సృష్టిలో ప్రతి జీవికి మరణం తప్పదు.. మరణం అనేది ఒక జీవితానికి ముగింపు .మరణించిన వారికి చేసే చిట్టచివరి గౌరవమే అంత్యక్రియలు.. అయితే ఈ అంత్యక్రియలను ఒక్కో ప్రాంతం వారు ఒక్కో రకంగా నిర్వహిస్తారు. ఇటీవల కాలంలో ఘనా దేశంలో సంబరంగా ఆడుతూ పాడుతూ అంత్యక్రియలు నిర్వహించడం ప్రపంచ దృష్టి ని‌ ఆకర్షిస్తోంది.సోషల్ మీడియా లోనూ ఈ ఘనా వాసుల అంతిమ వీడ్కోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Video Advertisement

ఘనా వాసులు చనిపోయిన వారి అంత్యక్రియలు చాలా ఆనందంగా డాన్స్ చేస్కుంటూ వెళ్తూ అదో సంబరంలాగా చేస్కుంటారు. మొదట్లో వీరి వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతుంటే , ఏదైనా షూటింగేమో, లేదంటే ఫన్నీగా చేసిన వీడియో అనుకున్నారు చాలామంది..కాని  అసలు విషయం ఏంటంటే అక్కడ ఎవరు చనిపోయినా అంత్యక్రియల్లో మ్యూజిక్, డాన్స్ తప్పనిసరి.దీనికోసం ప్రత్యేకంగా ఒక టీమ్ ఉంటుంది..వారి పని ఎవరు చనిపోయినా అక్కడికి వెళ్లి డాన్స్ చేస్తూ చుట్టు ఉన్నవారిని ఉత్సాహపరచడమే.

తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన యోగి సినిమా లో కూడా ఇదే విధంగా చూపిస్తారుగా ఐడియా ఉందా..బతికినన్నాళ్లు ఎలాగూ కష్టాలు పడతారు, కనీసం చనిపోయిన తర్వాత అయినా ప్రశాంతంగా పంపించాలనే కాన్సెప్ట్ అని అందులో చూపించారు. ఒక మనిషి ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎలా అయితే ఆహ్వానిస్తామో, అలాగే లోకాన్ని వదిలి వెళ్లేటపుడు వీడ్కోలు పలుకుతాము.

కానీ చావుతో మన వారిని శాశ్వతంగా కోల్పోవడం కోలుకోలేని విషాదం..దాంతో వారితో మన జ్ణాపకాలను తలచుకుంటూ బాధపడుతుంటాము.. ఆ బాధని ఒక్కోక్కరు ఒక్కో రూపంలో చూపిస్తే, కొందరు ఎంత బాధ ఉన్నా గుండెలోనే దాచుకుంటారు. కాని ఒక వ్యక్తి మనల్ని వీడిపోయాక మనకి మిగిలేది జ్ణాపకాలే.. కాబట్టి పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం తప్పదనే నిజాన్ని అంగీకరించి,వారికి సంతోషంగా వీడ్కోలు పలికి వారి జ్ణాపకాలతో జీవితాన్ని కంటిన్యూ చేస్తూ ముందుకు సాగిపోవాలి..

watch video:


End of Article

You may also like