Ads
కొన్ని సార్లు డైరెక్ట్ సినిమా కంటే రీమేక్ సినిమాలపై ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, సాధారణంగా ఒక హిట్ అయిన సినిమాని మాత్రమే రీమేక్ చేస్తారు. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి. ఆ సినిమాని, ఆ ఒక్క ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే కాకుండా, వేరే రాష్ట్రాల్లో కూడా చూస్తారు.
Video Advertisement
కొన్ని కొన్ని సార్లు రీమేక్ చేయడం చాలా కష్టం. ఒరిజినల్ సినిమా ఫ్లేవర్ ఏమాత్రం పాడవకుండా రీమేక్ చేయాలి. అంతే కాకుండా మన నేటివిటీకి తగ్గట్టుగా ఉండాలి. ఈ రెండు బ్యాలెన్స్ అయితేనే ఆ సినిమా ఒక సక్సెస్ ఫుల్ రీమేక్ అవుతుంది. ఈ సక్సెస్ ఫుల్ రీమేక్ కేటగిరీకి చెందిన సినిమా శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.
ఈ సినిమా మున్నాభాయ్ ఎంబీబీఎస్ కి రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఒరిజినల్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా, అలాగే మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉంటుంది ఈ సినిమా. అయితే.. ఈ సినిమాలో మెగాస్టార్ రోల్ తో పాటు మరొక రోల్ కు కూడా చాలా ప్రాధాన్యత లభించింది. అదే ATM క్యారెక్టర్. చిరంజీవికి తమ్ముడిగా ATM పాత్రలో కనిపించిన శ్రీకాంత్ ను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు.
ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ లో కూడా ATM గా శ్రీకాంత్ గారే నటించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలను శ్రీకాంత్ పంచుకున్నారు. ATM పాత్రకు తొలుత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటింప చేయాలనీ అనుకున్నారట. కానీ, అప్పటికే ఆయన వేరే సినిమాలు కమిట్ అయ్యి ఉండడంతో.. ఈ సినిమాకు కమిట్ మెంట్ ఇవ్వలేకపోయారట. ఆ తరువాత ఓ సందర్భంలో శ్రీకాంత్ చిరు ఇంటికి వెళ్ళినప్పుడు.. శంకర్ దాదా MBBS లో ATM రోల్ చేస్తావా? అని మెగాస్టార్ అడిగేసరికి శ్రీకాంత్ ఒప్పుకున్నారట. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం వల్ల కూడా ఆ పాత్రలు తెరపై మరింత రక్తికట్టించాయని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
End of Article