విక్రమ్ సినిమాలో “ఏజెంట్ టీనా” పాత్రలో నటించిన… ఆ యాక్టర్ ఎవరో తెలుసా..?

విక్రమ్ సినిమాలో “ఏజెంట్ టీనా” పాత్రలో నటించిన… ఆ యాక్టర్ ఎవరో తెలుసా..?

by Anudeep

Ads

ఈ జూన్ 3వ తేదీన కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రం ఊర మాస్ అంటూ ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వినిపిస్తుంది. మంచి కలెక్షన్లు రాబడుతు బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.

Video Advertisement

మన కథానాయకుడు కమల్ హాసన్ నటన గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన సహజమైన నటనతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తారు.

అయితే ఈ చిత్రంలో ఒక ఫిమేల్ క్యారెక్టర్ అందర్నీ ఆకర్షించింది. ఆవిడ యాక్షన్ కి థియేటర్లో ప్రేక్షకులు లేచి విజిల్ వేసే రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేసింది. తన మాస్ పర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.  ఆ ఫిమేల్ క్యారెక్టర్ ఎవరనుకుంటున్నారా ఆవిడే ఏజెంట్ టీనా. ఇప్పుడు చూసిన అందరి ప్రేక్షకుల మదిలో ఇదే ప్రశ్న.. ఎవరు ఈ ఏజెంట్ టీనా.. ఏజెంట్ టీనా అసలు పేరు వాసంతి. ఈవిడ పుట్టి పెరిగింది చెన్నై. ఈవిడ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి.

వాసంతి వృత్తిరీత్యా నృత్య కళాకారిణి. తమిళ చిత్రాలలో గ్రూప్ డాన్సర్ తన కెరీర్ ని ప్రారంభించింది. తన కృషి అభిరుచితో అసిస్టెంట్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా మారింది. ఈమె గత 30 సంవత్సరాలుగా అంటే 1992 నుంచి  తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. వాసంతి అనేకమంది డాన్స్ కొరియోగ్రాఫర్ లతో కలిసి పనిచేసింది. ప్రస్తుతం డాన్స్ కొరియోగ్రాఫర్ అయిన దినేష్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తుంది.

ఏజెంట్ tina

ఈమె తొలి రోజుల్లో నయనతార, త్రిష, అనుష్క, అమీజాక్సన్ వంటివారికి నృత్యం నేర్పించింది. అంతేకాదు  హీరో విజయ్ భగవతి లోనూ, అజిత్ వాలిమై లోనూ వాళ్లతో కలిసి నటించారు. విజయ్ మాస్టర్ సినిమాలో వాసంతి ఒక పాటకి అసిస్టెంట్ గా పనిచేసింది. అప్పుడు లోకేష్ కనగరాజ్ ఆమెను చూశారు. ఆమె ఆఫ్ స్క్రీన్ వైఖరిని ఇష్టపడి వాసంతిని తాను తీయబోయే విక్రమ్ సినిమాలో నటింపజేయాలని నిర్ణయించుకున్నాడు.

విక్రమ్ సినిమాలో నటించే అవకాశం మీకు ఎలా వచ్చిందని వాసంతి అని ఒక ఇంటర్వ్యూలో అడగగా , నేను మాస్టర్ షూటింగ్ టైంలో లోకేష్ సార్ ని కలిశాను. ఆ టైంలో లోకేష్ సార్ దినేష్ మాస్టర్ ని విక్రమ్ చిత్రంలో వాసంతికి ఒక పాత్ర ఉంది ఒప్పుకుంటుందా అని ఫోన్ చేసి అడిగారట. ఈ విషయం దినేష్ మాస్టర్ నాకు సమాచారం అందించారు. నేను ఆడిషన్ కి వెళ్లి నా అభిప్రాయం తెలియజేశాను.

నేను ఈ విక్రమ్ చిత్రంలో చేసిన ఏజెంట్ టీనా క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లెజెండ్ కమల్ హాసన్ సార్ తో నటించాలని నా కోరిక నెరవేరింది. నా క్యారెక్టర్ గాను అన్బరీవ్ మాస్టర్ కచ్చితమైన అవుట్ పుట్ వచ్చేలా జాగ్రత్త వహించేవారు. విన్యాసాలు చేసేటప్పుడు నాకు సూక్ష్మమైన నైపుణ్యాన్ని నేర్పించేవారు. అని ఏజెంట్ టీనా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు తెలియజేశారు. కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, సూర్య విజయ్ సేతుపతి వంటి దిగ్గజాలు నటించిన చిత్రంలో ఏజెంట్ టీనాగా నటించిన వాసంతి అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. తన పెర్ఫార్మెన్స్ గా నూటికి నూరు మార్కులు సంపాదించుకుంది.


End of Article

You may also like