“RRR” లో ఈ సీన్ లో తారక్ అని పిలిచింది ఎవరు..? థియేటర్ లో ఉన్నప్పుడు చూసుకోలేదు.. కానీ..?

“RRR” లో ఈ సీన్ లో తారక్ అని పిలిచింది ఎవరు..? థియేటర్ లో ఉన్నప్పుడు చూసుకోలేదు.. కానీ..?

by Anudeep

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?

Video Advertisement

వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. అంత పెద్ద స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటం కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది.

ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలో వర్షన్స్ జీ 5 లో విడుదల అయ్యాయి. హిందీ వర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యింది. దీనితో ఆర్ ఆర్ ఆర్ గురించిన టాపిక్ మళ్ళీ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో అందరికీ అందుబాటులో ఉండడంతో.. ఈ సినిమాను చూసి తెగ చర్చిస్తున్నారు. థియేటర్లో చూసినప్పుడు అన్ని విషయాలను గుర్తించడం సాధ్యం అవ్వదు. ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలో అందుబాటులో ఉండడంతో ఈ సినిమా గురించి ఓ రేంజ్ లో చర్చలు జరిపేస్తున్నారు.

ఈ సినిమాలో ఓ చోట ఒలీవియా రామ్ చరణ్, తారక్ లతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ టైం లో వెనక నుంచి ఎవరో తారక్ అని పిలిచినట్లు వినిపిస్తుంది. థియేటర్లో దీనిని మనం అంతగా గమనించలేం. కానీ ఓటిటిలో వీడియో అందుబాటులో ఉండడంతో ఈ సినిమాలో ఒక్కో మిస్టేక్ ను కనిపెట్టి ట్రోల్ చేస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజమే అయినా.. ఇన్నేళ్ల పాటు సినిమా తీశారు.. ఈ చిన్న విషయం చూసుకోలేదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


You may also like