” రాక్షసుడు 2 ” లో లీడ్ రోల్ లో నటించేది ఆ హీరో నేనా..?

” రాక్షసుడు 2 ” లో లీడ్ రోల్ లో నటించేది ఆ హీరో నేనా..?

by Anudeep

బెల్లంకొండ శ్రీనివాస్ హీరో గా వచ్చిన “రాక్షసుడు” మూవీ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ సినిమా దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమా కి సీక్వెల్ ని అనౌన్స్ చేసారు. అయితే..ఈ సినిమా లో హీరో గా నటించేది ఎవరన్న విషయాన్నీ మాత్రం సస్పెన్స్ లో పెట్టారు. ఈ క్రమం లో పలువురి నటుల పేర్లు వినిపిస్తున్నాయి..

Video Advertisement

vijay sethupathi

నిన్న “రాక్షసుడు 2 ” చిత్రం పోస్టర్ విడుదల సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఈ సినిమా లో హీరో ఎవరన్న విషయమై చర్చ మొదలైంది. ప్రముఖం గా వినిపిస్తున్న పేర్లలో విజయ్ సేతుపతి పేరు కూడా ఉంది. ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి పేరుని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం, దర్శకుడు రమేష్ వర్మ చెన్నై కి వెళ్లి విజయ్ సేతుపతి కి కథని కూడా వినిపించారని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి కూడా వరుస ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉన్నారు. ఆ సినిమాల డేట్స్ ని బట్టి “రాక్షసుడు 2 “సినిమా కి డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


You may also like