Ads
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ మూవీ 1000 కోట్ల కలెక్షన్లు దిశగా దూసుకుపోతోంది.
ఈ మూవీ ఇండియా వైడ్ సెన్సేషన్ సృష్టిస్తుంది. అయితే ఈ మూవీ క్లైమాక్స్ లో దీనికి సీక్వెల్ ఉంటుందంటూ ప్రకటించారు. దానికి యానిమల్ పార్క్ గా పేరు కూడా పెట్టారు. ఇప్పుడు అందరి దృష్టి యానిమల్ పార్క్ మూవీపై పడింది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Video Advertisement
సందీప్ రెడ్డి వంగ తన నెక్స్ట్ సినిమా బాహుబలి ప్రభాస్ తో చేయనున్నారు. దీనికి స్పిరిట్ అనే టైటిల్ ఖరారు చేశారు. 2024 లో షూటింగ్ స్టార్ట్ అయ్యి 2025లో ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ ప్రకటించారు. ఇది విడుదలయ్యక యానిమల్ కి సీక్వెల్ గా యానిమల్ పార్క్ మొదలవుతుంది. అయితే యానిమల్ మూవీ చూసిన అభిమానులు అందరూ వెంటనే సీక్వెల్ ను స్టార్ట్ చేయాలని కోరుతున్నారు. అయితే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక వార్త హల్ చల్ చేస్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళీ బ్యూటీ మాళవిక మోహన్ ని సెలెక్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. మాళవిక తమిళ్, మలయాళం లో పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన ఒక మూవీ చేస్తున్నారు. యానిమల్ పార్క్ లో హీరోయిన్ గా మాళవికాని సెలెక్ట్ చేసిన వార్త నిజమే అయితే ఇది ఆమె కెరీర్ కు బాగా ప్లస్ అవుతుంది.
End of Article