అసలు ఎవరు ఈ రాజు “పొన్నియన్ సెల్వన్”…? ఏమిటి అతని గొప్పతనం…?

అసలు ఎవరు ఈ రాజు “పొన్నియన్ సెల్వన్”…? ఏమిటి అతని గొప్పతనం…?

by Mohana Priya

Ads

ఎట్టకేలకు అనేక సంవత్సరాల నిర్మాణం తర్వాత మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం రెండు భాగాలలో విడుదల అవుతుంది. ఈ క్రమంలో “PS 1” చిత్రం సెప్టెంబర్ 30 న విడుదల అయ్యింది.

Video Advertisement

అయితే ఈ చిత్రం చోళ రాజవంశం మరియు రాజు రాజరాజ చోళన్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను మనకు తెలియజేస్తుంది. ఈ చిత్రంలో మొత్తం 50 ముఖ్యమైన పాత్రలు ఉండగా అందులో 15 అతి ముఖ్యమైన మరియు కథను ప్రధానంగా మలుపు తిప్పే పాత్రలు.

story of king ponniyin selvan

1994 నుండి మణిరత్నం ఈ చిత్రం తీయాలి అని ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2010 లో పర్ఫెక్ట్ లొకేషన్లు దొరకని కారణంగా ఆగిన ఈ ప్రాజెక్ట్ కు ఎట్టకేలకు 2019 న ఫిలిం ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఈ చిత్రం బడ్జెట్ ఎంతో తెలుసా…అక్షరాల 500 కోట్లు.
పొన్నియిన్ సెల్వన్ అనేది చోళ రాజవంశం యొక్క నిజమైన చారిత్రక సంఘటనలు మరియు పాత్రల నుండి తీసుకోబడిన ఒక సాహిత్య రచన, ఇది 1950 మరియు 1954 మధ్య తమిళ వారపత్రిక కల్కిలో ప్రచురించబడింది మరియు ఈ కథ 10వ శతాబ్దంలో చోళుల పాలనలో జరుగుతుంది.

story of king ponniyin selvan

ఇది పురాణ రాజు రాజరాజ చోళన్ మరియు చోళ సైన్యం కమాండర్ వల్లవరైయన్ వంద్యదేవన్ చుట్టూ తిరుగుతుంది. ఈ కథ శ్రీలంకలోని పొన్నియన్ సెల్వన్ రాజ రాజ చోళన్ పరిపాలించిన ప్రాంతాలలో జరుగుతుంది. ఈ కథ లో ముఖ్య కథానాయకుడు రాజరాజ చోళుడు. పొన్నియిన్ సెల్వన్ అనేది అతనికి ఉన్న బిరుదు. ఒకనాడు అతను కావేరి నదిలో పడి మునిగిపోగా ఆ నదే అతన్ని కాపాడింది అనేది స్థల పురాణం. అందుకే అతనికి కొన్ని పొన్నియిన్ సెల్వన్ అంటే కావేరీ పుత్రుడు అని పేరు వచ్చింది.

story of king ponniyin selvan

అతని అసలు పేరు అరుళ్ మొళి వర్మన్ కాగా సింహాసనం ఎక్కిన తరువాత రాజరాజ చోళుడుగా అతను పిలువబడ్డాడు. ఎంతో చారిత్రాత్మకమైన నిర్మాణం బృహదీశ్వర టెంపుల్ ఇతనే స్వయంగా నిర్మించాడు. ఇప్పటి శాస్త్రవేత్తలకు టెక్నాలజీకి అర్థం కాక సవాలుగా నిలిచే ఈ బృహదీశ్వర ఆలయం రాజరాజ చోళుడు కీర్తికి నిదర్శనం. అతను పరిపాలనకు వచ్చిన తర్వాత రాజ్యం సుభిక్షంగా వర్ధిల్లింది.

story of king ponniyin selvan

అతను రాజు కాక ముందు జరిగిన కథ ఈ చిత్రం. చరిత్రలో అతని పరిపాలనను స్వర్ణ ఇవ్వమంటారు, విద్యా వ్యాపారం వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో అతని రాజ్యం అత్యంత పురోగతిని సాధించింది అనడానికి చరిత్ర నిదర్శనం. ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ నందిని క్యారెక్టర్ లో విలన్ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఆమె మొదట ఆదిత్య కరికాలన్ ప్రేమించగా, తర్వాత కొన్ని కారణాల వల్ల అతన్ని ద్వేషించి అతన్ని చంపడం కోసం పాండ్యులతో చేతులు కలిపి పావులు కదుపుతుంది.

story of king ponniyin selvan

ఈ చిత్రం పూర్తిగా రాజుగా ఆధిపత్యం కోసం తెరువనుక జరిగే ఎద్దులు పైఎత్తులతో రకరకాల కుట్రలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.ఈ చిత్రంలో, కార్తీ వంద్యతేవన్‌గా, విక్రమ్‌ ఆదిత్య కరికాలన్‌గా, జయం రవి అరుల్‌మొళిగా నటించారు. ఐశ్వర్య రాయ్ నందినిగా నటిస్తుండగా, త్రిష కృష్ణన్ కుందవాయిగా నటించారు.


End of Article

You may also like