Ads
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ప్రాంతానికి నియోజకవర్గ సమన్వయకర్తగా మురుగుడు లావణ్యని నియమించారు. ఈ విషయం మీద శుక్రవారం నాడు కేంద్ర పార్టీ కార్యాలయం వారు ఉత్తర్వులు జారీ చేశారు. లావణ్య తల్లి కాండ్రు కమల. కమల మాజీ ఎమ్మెల్యే. లావణ్య మామయ్య మురుగుడు హనుమంతరావు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.
Video Advertisement
వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి లావణ్య తల్లి కమల సన్నిహితులు. 1987 లో రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో మురుగుడు హనుమంతరావు గారు మంగళగిరి మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేసి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999 నుండి 2004 వరకు ఎమ్మెల్యేగా ఆయన పని చేశారు.
ఆ తర్వాత 2004 లో ఎమ్మెల్యేగా మరొకసారి గెలుపొందారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, అంతే కాకుండా ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. లావణ్య తల్లి కమల 2004 సంవత్సరం నుండి 2009 సంవత్సరం వరకు మంగళగిరి మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్నారు. అంతే కాకుండా, కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా కూడా కమల పని చేశారు. అయితే వైసీపీ అధిష్టానం మంగళగిరి నియోజకవర్గంలో మార్పులు చేశారు. అసలు ముందు మొదటి జాబితాలో గంజి చిరంజీవిని ప్రకటించారు. తొమ్మిదవ జాబితాలో మంగళగిరి ఇంచార్జ్ గా మురుగుడు లావణ్య పేరుని ప్రకటించారు.
ఇప్పటి వరకు విడుదల చేసిన తొమ్మిది జాబితాల్లో, 71 మంది ఎమ్మెల్యే అభ్యర్థులని, 18 మంది ఎంపీ అభ్యర్థులని ప్రకటించారు. మంగళగిరిలో కొన్ని సర్వేలు నిర్వహించిన తర్వాత, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి ఒక టికెట్ ఇవ్వాలి అని అనుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. నారా లోకేష్ ని ఓడించడానికి ఇలాంటి ఒక ప్రయోగం చేయనున్నారు. లావణ్య పుట్టింటి వారు, అలాగే అత్తవారింటి వాళ్లు కూడా మంగళగిరి నియోజకవర్గంలో పదవుల్లో ఉన్నవారు. కాబట్టి లావణ్యని నియమించే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ALSO READ : అంబానీ వేడుకలకి టాలీవుడ్ నుండి “రామ్ చరణ్” ఒక్కరినే ఎందుకు పిలిచారు..? కారణం ఏంటంటే..?
End of Article