అంబానీ వేడుకలకి టాలీవుడ్ నుండి “రామ్ చరణ్” ఒక్కరినే ఎందుకు పిలిచారు..? కారణం ఏంటంటే..?

అంబానీ వేడుకలకి టాలీవుడ్ నుండి “రామ్ చరణ్” ఒక్కరినే ఎందుకు పిలిచారు..? కారణం ఏంటంటే..?

by Mohana Priya

Ads

మూడు రోజులపాటు అంబానీ ఇంట్లో వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో అందరికీ తెలిసిందే. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్ళికి ముందు జరిగే ఈ వేడుకలకు, ఎంతో మంది ప్రముఖులు హాజరు అయ్యారు. గుజరాత్ లోని జాంనగర్ లో ఈ ఈవెంట్ జరిగింది. బాలీవుడ్ నుండి ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకు వెళ్లారు.

Video Advertisement

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఇందులో పాల్గొన్నారు. కొంత మంది పర్ఫార్మెన్స్ ఇస్తే, కొంత మంది అతిధులుగా మాత్రమే హాజరు అయ్యారు. టాలీవుడ్ నుండి ఈ వేడుకలకు వెళ్లిన ఒకే ఒక్క వ్యక్తి రామ్ చరణ్. రామ్ చరణ్, తన భార్య ఉపాసనతో కలిసి ఈ వేడుకలకు హాజరు అయ్యారు.

why only ram charan is invited to anant ambani pre wedding festivities

తెలుగు నుండి ఈ ఆహ్వానం అందిన ఒకే ఒక్క వ్యక్తి కూడా రామ్ చరణ్ కావడం గమనార్హం. మిగిలిన వారిని ఎందుకు పిలవలేదు? కేవలం రామ్ చరణ్ కి మాత్రమే ఈ ఆహ్వానం ఎందుకు అందింది? అనే ప్రశ్న అందరిలో నెలకొంది. అయితే, ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన వ్యక్తిని ఆహ్వానిస్తూ, మొత్తం ఇండస్ట్రీకి గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే అంబానీ కుటుంబం ఈ పని చేసినట్టు తెలుస్తోంది. మిగిలిన ఇండస్ట్రీల నుండి ఆహ్వానం అందిన ప్రముఖులను పరిశీలిస్తే కూడా ఈ విషయం అర్థం అవుతోంది. అన్ని రంగాల్లో టాప్ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తులకి ఈ ఆహ్వానాలు అందాయి.

why only ram charan is invited to anant ambani pre wedding festivities

అందుకు కారణం, వారు కేవలం ఆ వ్యక్తులను కాదు. ఆ రంగాలని గౌరవించడానికి అక్కడ ఉన్న ప్రముఖులని పిలిచారు. అలాగే, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఘనతని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు కాబట్టి, రామ్ చరణ్ ని ఈ వేడుకకు పిలిచారు. తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి రజినీకాంత్ వెళ్లారు. అలా ప్రతి ఇండస్ట్రీ నుండి ఒక్కొక్క ప్రముఖులను పిలిచి ఆ ఇండస్ట్రీకి గౌరవం ఇచ్చారు. ఇప్పుడు రామ్ చరణ్ కి ఆహ్వానం అందడం అనేది టాలీవుడ్ మొత్తానికి గౌరవం ఇవ్వడం. రామ్ చరణ్ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తూనే అక్కడికి వెళ్లారు.

why only ram charan is invited to anant ambani pre wedding festivities

అక్కడ నాటు నాటు పాటకి కూడా రామ్ చరణ్ డాన్స్ చేశారు. ఒక తెలుగు పాట అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం మాత్రమే కాకుండా, ఇలాంటి వేడుకల్లో కూడా ప్రముఖులు, అది కూడా బాలీవుడ్ వాళ్లు డామినేట్ చేసే వేడుకల్లో మన తెలుగు పాటకి వాళ్లు డాన్స్ వేయడం, అందులో రామ్ చరణ్ వెళ్లి ఒక స్టెప్ వేయడం అనేది గొప్ప విషయమే కదా? పాట ప్లే అవుతున్నప్పుడు స్వయంగా నీతా అంబానీ వచ్చి రామ్ చరణ్ ని స్టేజ్ మీదకి ఆహ్వానించారు. అంతగా రామ్ చరణ్ ని, తెలుగు సినిమా ఇండస్ట్రీని వారు గౌరవించారు.

watch video :

ALSO READ : ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్… ఇప్పుడు IAS ఆఫీసర్..! ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?


End of Article

You may also like