ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్… ఇప్పుడు IAS ఆఫీసర్..! ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్… ఇప్పుడు IAS ఆఫీసర్..! ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

by Harika

Ads

చాలామంది సినిమాలలో నటించడం కోసం జీవితాలని పాడు చేసుకుంటూ ఉంటారు. ఉన్న కెరియర్ ని వదిలేసి మరీ ఈ కెరియర్ కోసం పాకులాడుతూ ఉంటారు. అయితే ఇందులో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటే రోడ్డున పడిన వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ మంది. కానీ కొందరు మాత్రం దూరదృష్టితో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.

Video Advertisement

అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మాయి కూడా చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలలో నటించింది. తర్వాత సమాజ సేవ కోసం సినిమాలని పక్కనపెట్టి ఐఏఎస్ ఆఫీసర్ అయింది. ఆమే బాలనటి గా అందరి మెప్పు పొందిన హెచ్ ఎస్ కీర్తన. ఈ క్రమంలో ఆమె చాలా ఒడిదుడుకులని ఎదుర్కొంది. బాల నటి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ గా ఆమే జర్నీ ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. హెచ్ఎస్ కీర్తన బాల్యంలో అటు బుల్లితెర ఇటు వెండి తెర మీద కూడా బాలనటిగా రానించింది. కన్నడలో సీరియల్స్ తో పాటు సినిమాలు కూడా చేసింది.

this child artist is now an ias officer

కర్పూరద గోంబే, గంగ- యమున, ముద్దిన అలియ, ఉపేంద్ర, హబ్బ, లేడీ కమిషనర్ వంటి చాలా సినిమాలలో నటించింది. తర్వాత ఆమె దృష్టి చదువుపై మళ్ళింది. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం దేశంలోనే అతికిష్టమైన పరీక్షలలో ఒకటైన యూపీఎస్సీ ఎగ్జామ్ రాసింది. కానీ ఓడిపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు ఆమె పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేకపోయింది.

this child artist is now an ias officer

కానీ పట్టువదలని విక్రమార్కుడి లాగా ఆరవసారి 2020 లో ఉత్తీర్ణత సాధించి ఆల్ ఇండియా లెవెల్ లో 167 వ ర్యాంకు సంపాదించింది. కర్ణాటకలోని మాండ్య జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గా అపాయింట్ అయింది. అయితే అంతకు ముందు ఆమె 2011లో కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి అందులో ఉత్తీర్ణత సాధించి రెండు సంవత్సరాల పాటు కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులుగా సేవలందించింది. మొదటి ప్రయత్నంలోనే ఫెయిల్ అయ్యి మన వల్ల కాదు అని చేతులెత్తేసే వాళ్ళకి కీర్తన ఒక ఇన్స్పిరేషన్.


End of Article

You may also like