అసలు ఎవరు ఈ నిఖిల్ విజయేంద్ర సింహ..? ఇతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

అసలు ఎవరు ఈ నిఖిల్ విజయేంద్ర సింహ..? ఇతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by kavitha

Ads

నిఖిల్ విజయేంద్ర సింహ సోషల్ మీడియా స్టార్  గుర్తింపు పొందారు. నిఖిల్ ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్  వీడియోలతో  పాపులర్ అయ్యాడు. సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ యూట్యూబ్ లో చాలా పాపులర్ అయ్యాడు

Video Advertisement

రీసెంట్ గా మెగా డాటర్ నీహారిక కొణిదెలను ఇంటర్వ్యూ చేసిన నిఖిల్ విజయేంద్ర సింహ మరోసారి వార్తల్లో నిలిచారు. ఖిల్ విజయేంద్ర సింహ బ్యాగ్రౌండ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
నిఖిల్ విజయేంద్ర సింహ పేరు సోషల్ మీడియా మరియు యూట్యూబ్ ఫాలో అయ్యేవారికి సుపరిచితం. యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించి, కాస్కో అనే సెలబ్రిటీ టాక్ షోతో అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యారు.  ఈ ప్రోగ్రామ్ హిట్ కావడంతో నిఖిల్ పాపులారిటీ అనూహ్యంగా పెరిగింది. మెగాడాటర్  నిహారిక, మంచు లక్ష్మి, వితిక, హారిక వంటివారికి నిఖిల్ ఫ్రెండ్ కూడా. సినీ సెలెబ్రెటీ పార్టీల్లో నిఖిల్ కనిపిస్తూ ఉంటాడు. నిఖిల్  మూవీ ప్రమోషన్స్ మూవీ యూనిట్ ను ఇంటర్వ్యూలు ఇస్తారు. నిఖిల్ సోషల్ మీడియా మరియు యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉంటారు.
నిఖిల్ విజయేంద్ర సింహ 1996లో సెప్టెంబర్ 18న విశాఖపట్నంలో జన్మించారు. అతని తండ్రి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండగా, తల్లి ఒక ఎన్జీవో  కోసం పనిచేయడమే కాకుండా, ఖాజాగూడలో దిబ్బరోట్టి అనే రెస్టారెంట్‌ను కూడా నిర్వహిస్తోంది. నిఖిల్ 2018లో గీతం యూనివర్శిటీ నుండి బికాం  (ఆనర్స్) పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చారు. తమ్మడ మీడియాలో పని చేయడం ప్రారంభించాడు. అలా ‘మహతల్లి’ ఛానెల్‌లో షార్ట్ ఫిల్మ్‌లలో కనిపిస్తూ యాక్టింగ్ లో ప్రవేశించాడు.
2019లో, నిఖిల్ తన సొంత యూట్యూబ్ ఛానెల్ ‘కాస్కో’ని మొదలుపెట్టి, తక్కువ సమయంలోనే నాలుగు లక్షలమంది సబ్‌స్క్రైబర్‌లను సంపాదించాడు. అందులో కంటెంట్, ఛాలెంజ్ వీడియోలు, ఫన్నీ వీడియోలు, సెలబ్రిటీ హోమ్ టూర్‌లతో పాటు సెలబ్రిటీలతో ఎంగేజింగ్ వీడియోలతో చాలా పాపులర్ అయ్యారు. 2020లో, నిఖిల్ తన ఫ్రెండ్ భానుతో కలిసి సొంత ప్రొడక్షన్ హౌస్ ‘రాయుడు చిత్రాలు’ స్థాపించాడు. నిహారిక కొణిదెల, అనసూయ భరద్వాజ్ వంటి ప్రముఖ నటీనటులు లీడ్ రోల్స్ లో వెబ్ సిరీస్‌ని నిర్మించారు. అంతేకాకుండా ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్ యువరాజ్ సింహ నిఖిల్ కి సొంత అన్నయ్య అని సమాచారం.

Also Read: చిరంజీవికి అవార్డు ఇచ్చారు… కానీ ఇంత గొప్ప నటుడిని ఎలా మర్చిపోయారు..? ఆయనని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు..?

 


End of Article

You may also like