Ads
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా వచ్చిన యాత్ర సినిమా అప్పట్లో ప్రేక్షకులను బాగానే అలరించింది. ప్రముఖ దర్శకుడు మహీ వి రాఘవ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. వైయస్సార్ గా మమ్ముట్టి నటించగా ఆయన వైయస్సార్ పాత్రలో ఒదిగిపోయారు. 2019 ఎలక్షన్ల టార్గెట్ గా యాత్ర సినిమా వచ్చింది.
Video Advertisement
ఇప్పుడు 2024 ఎలక్షన్ లు దగ్గర పడటంతో మళ్ళీ ఈ సినిమాకు సీక్వెల్ తీసే పనులు దర్శకుడు మహి వీ రాఘవ ఉన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రను ఆధారంగా చేసుకుని యాత్ర2 సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో జగన్మోహన్ రెడ్డి గా ప్రముఖ తమిళ హీరో జీవా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 2024 ఫిబ్రవరి 8న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర సీఎం జగన్ భార్య వై ఎస్ భారతి గారిది. వైఎస్ భారతి పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె ఫస్ట్ లుక్ను విడుదల చేశారు ఈ సినిమా డైరెక్టర్. మలయాళ నటి కేతకి నారాయణ్ ఈ సినిమాలో వైఎస్ భారతిగా నటిస్తున్నారు. మలయాళం, హిందీ, మరాఠీ సినిమాల్లో నటించారు. 83, అవియాల్, విచిత్రం, సమైరా సినిమాలతో ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.
“నిజమేన్నా మా ఇంట్లో ఆడవాళ్లకి రాజకీయాలు, వ్యాపారాలు నేర్పించలేదు. అట్లానే మాకు కష్టం, సమస్య వస్తే భయపడి వెనుతిరిగి చూడటం కూడా నేర్పించలేదు..” అనే కాప్షన్ తో ఈ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.
https://twitter.com/MahiVraghav/status/1733394466076332322
End of Article