అసలు యెస్ బ్యాంకు ఎవరిది? రాణా కపూర్ కి సంబంధం ఏంటి? సంక్షోభం వెనుక అసలు కథ.!

అసలు యెస్ బ్యాంకు ఎవరిది? రాణా కపూర్ కి సంబంధం ఏంటి? సంక్షోభం వెనుక అసలు కథ.!

by Anudeep

Ads

ఇటీవల కాలంలో బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేసిన అంశం ఎస్ బ్యాంక్ సంక్షోభం . చాలా తక్కువ కాలంలోనే బ్యాంకింగ్ రంగంలో నిలదొక్కుకుని, ఎంత ఫాస్ట్ గా ఎదిగిందో అంతే ఫాస్ట్ గా అధ: పాతాలానికి పడిపోయింది.  ఎస్ బ్యాంక్ ఖాతాదారులను కలవరపెట్టిన ఈ వార్త, ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బిఐ ,ఎస్ బ్యాంక్  ని చేపడుతుందని తెలిసి కొంత ఊరట లభించింది.

Video Advertisement

ఒక సంస్థని బాగుపర్చాలన్నా, పాడుచేయాలన్నా ఆ సంస్థ అధిపతి పైనే ఉంటుంది. ఎస్ బ్యాంక్ అభివృద్దిలో బ్యాంక్ వ్యవస్థాపకుడు, సిఇఎ రాణా కపూర్ పాత్ర ఎంతో ఉంది. ఇటీవల రాణాకపూర్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన విషయం విదితమే .రాణా కపూర్ కి సంబందించి కొన్ని  విషయాలు.

yes bank

1957 లో ఢిల్లీ జన్మిచిన రాణాకపూర్ చదువంతా ఢిల్లీలోనే జరిగింది. 1973 లో పాఠశాల విద్యను పూర్తి చేసి , 77లో డిగ్రీ పట్టా పుచ్చుకునారు. 1980లో అమెరికాలోని రట్గర్స్ యూనివర్శిటిలో ఎంబిఏ పూర్తి చేశారు. రాణా కుమార్ భార్య బిందూ కపూర్ , వారికి ముగ్గురు కూతుళ్లు రాధా, రాఖీ , రోషిణి . ప్రస్తుతం యెస్ బ్యాంక్ సంక్షోభంలో పోలీసులు వీరిని కూడా విచారిస్తున్నారు. ఎంబిఏ పూర్తైన తర్వాత అమెరికాలోని బారాఖంబా బ్యాంక్లో బ్యాంకర్ గా కెరీర్ ప్రారంభించారు రాణా. అక్కడ పదహారేళ్లు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ఎఎన్ గ్రిండ్లేస్ సంస్తకి మేనేజర్, కంట్రీ హెడ్ గా వ్యవహరించారు.

Yes Bank

అసోచామ్ అధ్యక్షుడిగానూ పనిచేశారు రాణా కపూర్. అమెరికానుండి తిరిగొచ్చి సోదరుడు అశోక్ కపూర్, హర్ కిరత్ సింగ్ లతో కలిసి ఇండియా ఫైనాన్స్ సంస్థని ప్రారంబించారు.నెదర్లాండ్స్ కి చెందిన రాబో బ్యాంక్ 75శాతం ఉండగా, ఇండియా ఫైనాన్స్ లో వీళ్ల ముగ్గురి వాటా 25% .ప్రైవేట్ బ్యాంక్ స్టార్ట్ చేయాలనుకుని,  వారి ముగ్గురి వాటాలను అమ్మి బ్యాంక్ స్థాపనకు లైసెన్స్ పొందారు . ఇది బ్యాంక్ ఆవిర్భావం వెనుక ఉన్న స్టోరీ. బ్యాంక్ ప్రారంభించిన సంవత్సరం 2004.భారీ మొండి బాకీల వల్ల బ్యాంక్ దెబ్బ తిన్నది, రాణా కపూర్ మాత్రం లెండర్ ఆఫ్ ది లాస్ట రిసార్ట్ టైటిల్ దక్కించుకున్నారు. బ్యాంక్ ఇచ్చిన లోన్లను బాడ్ లోన్లుగా పక్కకి పెట్టేస్తారు. విజయ్ మాల్యా, రాణాకపూర్ ఇద్దరూ ఎదుర్కొంటున్న కేసులు దాదాపు ఒకటే.

yes bank issue

గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ నెగటివ్ రిపోర్ట్ ఇవ్వడంతో  రాణా కపూర్ తన కెరీర్లో ఫస్ట్ టైం ప్రతికూలతను ఎదుర్కొన్నారు. యూబిఎస్  రిపోర్ట్ వాస్తవం కాదని, పక్షపాత పూరితం అని రాణా వాదించారు. బ్యాంక్ అభివృధ్దికి రాణా కపూర్ ఎంత కష్టపడ్డప్పటికి ఓడిపోక తప్పలేదు. 2016-17లో ఎస్ బ్యాంక్ మొండీ బాకీలు 6,355 కోట్లు, అదే ఏడాది రాణా కపూర్ బ్యాంక్ నుండి తప్పుకున్నారు. ఈ నాలుగేళ్లల్లో బ్యాంక్ రికవరీ కాలేదు, మొత్తంగా మూతపడే పరిస్థితి వచ్చింది.

RBI

ఇప్పుడు ఎస్ బ్యాంక్ ని టేకోవర్ చేయాలని ఎస్ బిఐ కి సూచిస్తుంది ఆర్బీఐ. ఇప్పటికే దేశంలో బ్యాంకుల్లో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ముందు పట్టించుకోని ఆర్బిఐ, ఇప్పుడు ప్రభుత్వరంగ వాణిజ్య సంస్థ ఎస్బిఐ కి అప్పచెప్పడాన్ని కొందరుతప్పుపడుతున్నారు.


End of Article

You may also like