హమ్మయ్యా, మొత్తానికి టాలివుడ్ హీరోలు ఒక్కొక్కరూ బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్తున్నరు..నిఖిల్, నితిన్ పెళ్లిల్లు కరోనా పాండమిక్ సిట్యుయేషన్ మూలంగా వాయిదా పడ్డాయి.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ రాణా,ప్రభాస్ ల పెళ్లి గురించే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..రాణా కూడా ఆల్మోస్ట్ ఒకె అయిపోయినట్టే..ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు?? ఏం చేస్తుంటుంది??
Video Advertisement
“And She said YES” అంటూ ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉన్న ఫోటో ఒకటి తన ఇన్స్టా అకౌంట్లో అప్లోడ్ చేశాడు రాణా..క్యాప్షన్ పక్కనే లవ్ సింబల్ కూడా పెట్టాడు. ఆ అమ్మాయి ఎవరా అంటూ సోషల్ మీడియాలో సెర్చింగ్ స్టార్టయింది.. పేరు మిహికా బజాజ్, ఊరు హైదరాబాద్.. అవును హైదరాబాద్ అమ్మాయే.కాకపోతే ప్రస్తుతం ముంబాయిలో ఉంటుంది.. Dew drop design studio పేరిట ఈవెంట్ అండ్ డెకార్ మేనేజ్మెంట్ కంపెనిని నిర్వహిస్తుంది.
మిహికా బజాజ్ తల్లిదండ్రులు సురేశ్ బజాజ్, బంటీ బజాజ్ జ్యువెలరీ బిజినెస్ నిర్వహిస్తున్నారు..తల్లి బంటీ బజాజ్ కి జువెలరీ డిజైనర్ గా మంచి పేరుంది. పెళ్లిల్లకు,ఇతర ఫంక్షన్లకు ఈవెంట్ మానేజ్మెంట్ కూడా చేసేవారు..మిహికా కూడా తల్లికి తన పనిలో సాయం చేసేది..ఎలాగూ తెలిసిన వర్క్ కాబట్టి తను కూడా ఈవెంట్ మానేజ్మెంట్ చేస్తే బాగుంటుందని డ్యూ డ్రాప్ స్టూడియోని స్థాపించింది, మిహిక సోదరుడు సమర్ద్, తల్లికి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు చూస్కుంటూ ఉంటాడు..సమర్ద్ భార్య సాషా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కునాల్ రావల్ సోదరి.
రాణా పోస్టుకి నెటిజన్స్ కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తే, ఇంతకీ దేనికి యస్ చెప్పింది..యారీ నెం.1 ప్రోగ్రాం ఇంటర్వ్యూ ఇవ్వడానికా అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నరు.. ఇదే పోస్టుకి సమంతా పెట్టిన కామెంట్ ఆసక్తికరంగా మారింది.. రాణా పోస్టుకి సమంతా “dead died” అంటూ కామెంట్ చేయడంతో నిన్ను చేసుకున్నాడుగా చైతూకూడా dead died ఆ అంటూ కొందరు,నువ్ చైతూని పెళ్లిచేసుకున్నప్పుడు మా పరిస్థితి ఇంతే అని రిప్లై కామెంట్లు పెట్టారు..
భళ్ళాల దేవుడు కూడా ఎగ్జిట్ అయిపోతే…ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీమ్ లో మిగిలింది ఒన్ అండ్ ఓన్లీ బాహుబలి…రియల్ లైఫ్ లో బాహుబలి వరించే దేవసేన ఎవరవుతారో…ఆ విషయాన్ని ఏ విధంగా రివీల్ చేస్తారో అనేది ఆసక్తికరంగా ఉంది.
Also Check >>>Manasa Radhakrishnan Images

Manasa Radhakrishna images