Home Filmy Adda “కాంతార ” కి హీరోగా… మొదటగా అనుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

“కాంతార ” కి హీరోగా… మొదటగా అనుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

by Anudeep

కన్నడ సినిమా ఇండస్ట్రీలో పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కేజీయఫ్ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా కేవలం కన్నడ లోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఊహించిన విధంగా కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యం కలిగించింది. కన్నడలో కేజీయఫ్ తర్వాత ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రం గా కాంతార నిలిచింది.

 

ఈ సినిమాను డైరెక్ట్ చేసిన రిషబ్ శెట్టికి మంచి గుర్తింపు లభించింది. అలాగే కాంతార సినిమాలో అతనే హీరోగా నటించిన విషయం తెలిసిందే. చివరి పది నిమిషాల్లో కూడా రిషబ్ నటించిన విధానం ఆశ్చర్యాన్ని కలిగించింది.

who is the first choice for kanthara movie..
దర్శకుడు రిషబ్ శెట్టి తన సొంత ఊరి కథనే ‘కాంతార’ స్క్రిప్ట్ గా రాసుకున్నాడు. ఈ సినిమాను భారీగా తెరకెక్కించాలని భావించి హోంబలే ఫీలింస్ నిర్మాతలను సంప్రదించాడు. వారి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో హీరోగా పునీత్ రాజ్ కుమార్ అయితేనే బాగుంటుందని దర్శకుడు రిషబ్ శెట్టి భావించాడు. దీంతో అతడి వద్దకు వెళ్లి ‘కాంతార’ స్టోరీ విన్పించాడు. దేవుడి బ్యాక్ డ్రాప్ లో ఉన్న ‘కాంతార’ స్టోరీ పునీత్ రాజ్ కుమార్ ఎంతగానో నచ్చింది. ఇందులో హీరోను దేవుడి ఆవహించినట్లు దర్శకుడు కథను రూపొందించాడు. దీంతో పునీత్ రాజ్ కుమార్ తన కంటే కూడా ఈ కథను రాసిన నువ్వు చేస్తేనే బాగుంటుందని రిషబ్ శెట్టికి సలహా ఇచ్చాడు. దీంతో రిషబ్ శెట్టినే ‘కాంతార’లో హీరోగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

who is the first choice for kanthara movie..
ఈ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ నటించి ఉంటే ‘కాంతార’నే అతడి చివరి నిలిచి ఉండేది. ఆయన ఖాతాలో మరో సూపర్ హిట్ చేరి ఉండేది. కానీ రిషబ్ శెట్టిలో అద్భుతమైన నటుడి గురించి ఎవరికీ తెలిసి ఉండకపోయేది. ‘అప్పు’ సలహాతో రిషబ్ శెట్టి దర్మకుడు కమ్ హీరోగా ‘కాంతార’లో నటించి ప్రస్తుతం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

మరోవైపు కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అలియాస్ ‘అప్పు’ గతేడాది అక్టోబర్ 29న హఠాన్మరణం చెందిన విషయం తెల్సిందే. నీత్ రాజ్ కుమార్ వర్ధంతిని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే(అక్టోబర్ 28న) ఆయన నటించిన చివరి చిత్రం ‘గంధన గుడి’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో మంచి టాక్ తో దూసుకెళుతోంది.

You may also like