సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ ఆచార్య ఫెయిల్యూర్ నుంచి ఇంకా బయట పడలేదు. కొరటాల శివకి ఈ చిత్రం తొలి ఎదురుదెబ్బ. మెగా అభిమానులైతే ఈ ఫెయిల్యూర్ ని జీర్ణించుకోలేకపోతున్నారు. కొరటాల స్క్రిప్ట్, దర్శకత్వం పూర్తిగా బెడిసికొట్టాయి.

Video Advertisement

కథ, దర్శకత్వంపై దృష్టి పెట్టకుండా సినిమా బిజినెస్ పైనే కొరటాల శివ ఫోకస్ పెట్టి.. అవుట్ పుట్ గాలి కొదిలేయడంతో ఆచార్య చిత్రం దారుణంగా విఫలమైందని విమర్శిస్తున్నారు. కొరటాల శివ నుంచి ఇంత దారుణమైన చిత్రం మెగా ఫ్యాన్స్ అసలు ఊహించలేదు.

ఇదిలా ఉండగా కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఎన్టీఆర్ 30 పై రోజురోజుకి అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మూవీ రివ్యూ, రేటింగ్ ఇచ్చే ప్రముఖ సంస్థ ఐఎండీబీ (IMDB)లో గత నెల హీరోయిన్ అలియా భట్ పేరు లేదు కానీ ఈ రోజు ఉదయం చేర్చారు. అలాగే డైరెక్టర్ కొరటాల శివ పేరుతో పాటు మరో ధనిష్ మనియర్ అనే కొత్త పేరు కూడా అదనంగా చేర్చారు. అస్సలు ఈ ధనిష్ మనియర్ ఎవరో ఎవరికి తెలీదు. ఇప్పటికైనా ఈ సినిమాకు సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించమని అభిమానులు కోరుతున్నారు.

ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందోనని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఈ సినిమా అంత త్వరగా సెట్స్ పైకి వెళ్లకపోవచ్చని తెలుస్తుంది. ఇది ఆలస్యం అవుతే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా ప్రారంభిస్తాడు జూనియర్.