హెలికాప్టర్ లో పనులు పర్యవేక్షించారు… అసలు ఎవరు ఈ స్మితా సబర్వాల్..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

హెలికాప్టర్ లో పనులు పర్యవేక్షించారు… అసలు ఎవరు ఈ స్మితా సబర్వాల్..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by kavitha

Ads

తెలంగాణ రాజకీయాలలో గత రెండు రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు స్మితా సబర్వాల్. ఆమె సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, డైనమిక్ ఆఫీసర్‌గా స్మితా సబర్వాల్ మంచి పేరుంది. గత తెలంగాణ ప్రభుత్వంలో ఆమె కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సీఎంవో అధికారిగా, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కాళేశ్వరం, మిషన్ భగీరథ పనులను కూడా పర్యవేక్షించారు.

Video Advertisement

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత  స్మితా సబర్వాల్ ఇప్పటి వరకు సీఎం రేవంత్‌ రెడ్డిని కలవలేదు. దాంతో ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నట్లుగా, కేంద్రానికి అప్లై చేసుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఆమె పై మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలన కామెంట్స్ చేశారు. మరి ఆమె ఎవరో, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
స్మితా సబర్వాల్ 1977 లో పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో బెంగాలీ ఫ్యామిలిలో ఆర్మీ అధికారి కల్నల్ ప్రణబ్ దాస్, పురబీ దాస్‌లకు జూన్ 19న జన్మించారు. ఆమె సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్‌లో చదువుకున్నారు. ఐసీఎస్ఈ పరీక్షలో స్మితా సబర్వాల్ ఆల్ ఇండియా టాపర్ గా నిలిచారు. హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ ఫర్ ఉమెన్ కాలేజ్ నుండి కామర్స్‌లో పట్టా తీసుకున్నారు. 2000లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష రాసిన ఆమె, ఆల్ ఇండియా స్థాయిలో 4వ ర్యాంక్ సాధించింది. అప్పుడు ఆమె వయసు 22 ఏళ్ళు.
2001లో ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో స్మితా సబర్వాల్ అడ్మినిస్ట్రేటివ్ శిక్షణ పూర్తి చేసింది. తన ప్రొబేషన్ టైమ్ లో ఆదిలాబాద్ జిల్లాలో ట్రైనింగ్ పొందారు. ఆ తరువాత చిత్తూరులోని మదనపల్లి సబ్ కలెక్టర్‌గా ఆమె మొదటిసారి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత కడప డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌గా గ్రామీణాభివృద్ధి విభాగంలో పనిచేశారు. ఆ తరువాత వరంగల్ మునిసిపల్ కమీషనర్‌గా పనిచేశారు.  ఆమె “ఫండ్ యువర్ సిటీ” అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.
ట్రాఫిక్ జంక్షన్లు, ఫుట్ ఓవర్‌బ్రిడ్జ్‌లు, బస్-స్టాప్‌లు, పార్కులు వంటి పెద్ద సంఖ్యలో పబ్లిక్ యుటిలిటీలను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో (PPP) క్రియేట్ చేశారు. ఆ తర్వాత విశాఖపట్నంలో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. 2011 ఏప్రిల్ లో, సబర్వాల్ కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అక్కడ ఆమె ఆరోగ్యం మరియు విద్యా రంగంలో చాలా కృషి చేశారు. ప్రజాప్రతినిధుల సహకారంతో కరీంనగర్ సిటీలో విశాలమైన రోడ్లు, ట్రాఫిక్ జంక్షన్లు, బస్టాప్‌లు, మరుగుదొడ్లు మరియు ఇతర ప్రజా ప్రయోజనాల రూపంలో కొత్త రూపురేఖలను సంతరించుకునేలా చేశారు.
2012–2013లో ప్రధానమంత్రి 20 పాయింట్ల కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఉత్తమ జిల్లాగా అవార్డు పొందింది. 2014 సార్వత్రిక ఎన్నికల టైమ్ లో ఆమె మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఆమె కలెక్టర్ గా కరీంనగర్ మరియు మెదక్ జిల్లాలను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపింది. ఇది ఇలా ఉంటే, తాజాగా ఆమె పై మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలన కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వంలో చేసే తప్పులు చేసి, ఇప్పుడు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళడం ఫ్యాషన్ అయ్యిందని, ఆమెని వెళ్ళకుండా చూడాలని ‘దేశం మొత్తంలో హెలికాప్టర్‌లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఈమెగారు మాత్రమే’ అంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు.

Also Read: సీతక్క మంత్రి అయింది… తన స్వగ్రామానికి బస్సు వచ్చింది…!

 


End of Article

You may also like