ఈ ఫోటోలో సీనియర్ ఎన్టీఆర్ పక్కన ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా…? ఇప్పటి ఎమ్మెల్యే.!

ఈ ఫోటోలో సీనియర్ ఎన్టీఆర్ పక్కన ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా…? ఇప్పటి ఎమ్మెల్యే.!

by Mounika Singaluri

ప్రస్తుత తరానికి ఎన్టీఆర్ అనగానే సినిమా నటుడు జూనియర్ ఎన్టీఆర్ గుర్తు వస్తారు. అయితే పాత తరానికి ఎన్టీఆర్ అంటే ఎప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ నే. సినిమా నటుడిగా తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తెలుగువారికి ఒక గుర్తింపు తెచ్చిన నాయకుడు సీనియర్ ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ ఏ పాత్ర వేసిన అందులోకి పరకాయ ప్రవేశం చేసేవారు. తెలుగువారికి రాముడు అన్న, కృష్ణుడు అన్న ఎన్టీఆర్ యే. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కొత్త చరిత్రనే సృష్టించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. నేటికీ ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా ఉంది.

Video Advertisement

అయితే సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఫోటోలు అప్పుడప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో ఎన్టీఆర్ పక్కన ఒక వ్యక్తి నిలబడి ఫోటో దిగారు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అంటూ ఆరాల తీస్తున్నారు ప్రజలు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే హైదరాబాద్ ప్రాంతంలోని అత్యధిక ధనికులు ఉండే ప్రాంతం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.

మాగంటి గోపీనాథ్ తెలంగాణ రాష్ట్రంలోని హైదర్ గూడా లో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి బిఎ పూర్తిచేసి 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ ప్రవేశం చేశారు. 1985 నుండి 92 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.

1987 నుండి 88 వరకు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ గా ఉన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మళ్లీ తిరిగి 2018 లో ఇదే నియోజకవర్గ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తనకి ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ అంటే ఆరాధ్య దైవం అని, రాజకీయ గురువు అని మాగంటి గోపీనాథ్ చెబుతూ ఉంటారు.  తాజాగా 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు మాగంటి గోపీనాథ్.


You may also like

Leave a Comment