Ads
తెలుగుతో పాటు తమిళ్ లో, అలాగే హిందీలో కూడా సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న నటి తమన్నా భాటియా. తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే గత కొంత కాలం నుండి తమన్నా ప్రేమలో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి.
Video Advertisement
అది కూడా విజయ్ వర్మ అనే ఒక నటుడిని తమన్నా ప్రేమిస్తున్నారు అనే వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు తమన్నా స్పందించలేదు. కానీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా ఈ విషయంపై మాట్లాడుతూ తాను రిలేషన్ షిప్ లో ఉన్నట్టు చెప్పారు.
విజయ్ వర్మతో తాను ప్రేమలో ఉన్నట్టు తమన్నా తెలిపారు. విజయ్ వర్మ హిందీ నటుడు అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలిసిన నటుడు. నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో విజయ్ వర్మ విలన్ పాత్రలో నటించారు. నటించింది ఒక్క సినిమా అయినా కూడా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. హిందీలో పింక్, గల్లీ బాయ్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
అటు నెగిటివ్ పాత్రలని, ఇటు పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలని చాలా సులభంగా పోషిస్తారు విజయ్ వర్మ. తమన్నా, విజయ్ కలిసి ఇటీవల ఒక సిరీస్ లో నటించారు. ఇలా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. తర్వాత వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇప్పుడు ఈ సిరీస్ విడుదల అవుతోంది. తమన్నా హిందీలో సినిమాలు, సిరీస్ చేయడంతో పాటు తెలుగులో కూడా చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.
అంతే కాకుండా మలయాళంలో కూడా ఒక సినిమాలో నటిస్తున్నారు. విజయ్ వర్మ విలన్ పాత్రలో నటించిన దహాడ్ ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యి చాలా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తమన్నా వారిద్దరి ప్రేమ గురించి మాట్లాడుతూ, విజయ్ తో తన బంధం చాలా స్పెషల్ అని చెప్పారు. తమన్నా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో సోషల్ మీడియా ద్వారా అందరూ తమన్నాకి అభినందనలు తెలుపుతున్నారు.
End of Article