బాలకృష్ణ ఆ స్టార్ హీరోయిన్ ని ప్రేమించాడా? వీరి పెళ్లికి అడ్డుపడిన వ్యక్తి ఎవరు?

బాలకృష్ణ ఆ స్టార్ హీరోయిన్ ని ప్రేమించాడా? వీరి పెళ్లికి అడ్డుపడిన వ్యక్తి ఎవరు?

by kavitha

Ads

తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలికి ఉన్న గౌరవం, ప్రత్యేకత గురించి అందరికి తెలిసిందే. నందమూరి ఫ్యామిలి నుండి ఇప్పటి వరకు చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో ఆడుగుపెట్టారు. కొందరు హీరోలుగా రాణిస్తున్నారు.  ఇటీవల నందమూరి కుటుంబం నుండి వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ రావడంలో ముఖ్యమైన పాత్ర వహించిన విషయం తెలిసిందే.

Video Advertisement

ఇదిలా ఉండగా నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ అంతటి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా బాలయ్య సినిమాల గురించి పక్కన పెడితే అప్పట్లో బాలయ్య ఒక స్టార్ హీరోయిన్ ని ఎంతగానో ప్రేమించారట. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో, వారి పెళ్లికి అడ్డుపడింది ఎవరో ఇప్పుడు చూద్దాం.. ఎన్టీఆర్ తన వారసుడుగా బాలకృష్ణను సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం చేశాడు. అలా వచ్చిన బాలకృష్ణ టాలీవుడ్ లో టాప్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటికి కూడా బాలయ్య తన చిత్రాలతో ఈ తరం హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. అయితే బాలకృష్ణ తన కెరీర్ మొదట్లో ఒక స్టార్ హీరోయిన్ ని ప్రేమించారట. ఆ హీరోయిన్ ని వివాహం చేసుకోవాలని ఎంతగానో అనుకున్నాడంట. అయితే బాలయ్య ఆశలపై ఆయన తండ్రి ఎన్టీఆర్ నీళ్లు చల్లారు. దానికి కారణం బాలయ్య  ప్రేమించిన ఆ హీరోయిన్ గ్లామర్ పాత్రలు చేసింది.
ఎన్టీఆర్ తమ ఇంటికి కోడలుగా అడుగు పెట్టె అమ్మాయి పద్ధతిగా ఉండాలని భావించారు. ఆ హీరోయిన్ పద్ధతి లేకుండా గ్లామర్ రోల్స్ చేస్తూ ఉండడంతో ఎన్టీఆర్ గారికి నచ్చలేదు. ఆ కారణంతో బాలయ్య ఆమెను పెళ్లి చేసుకోకుండా అడ్డుపడ్డారు. ఈ విషయంలో హరికృష్ణ కూడా ఆ పెళ్లికి అడ్డు చెప్పారంట. చిత్రాల గురించి మాత్రమే ఆలోచించమని,  ప్రేమ అని ఫ్యామిలీ పరువు తీయవద్దని ఎన్టీఆర్ బాలయ్యకి వార్నింగ్ ఇవ్వడంతో ఆయన సైలెంట్ అయ్యారంట.అయితే బాలయ్య ఆ హీరోయిన్ ని ఎక్కడ పెళ్లి చేసుకుంటారో అని నెల రోజుల్లోనే ఎన్టీఆర్ వసుంధర దేవితో పెళ్లి జరిపించాడు. వసుంధర దేవి సాంప్రదాయమైన ఫ్యామిలిలో పుట్టిన అమ్మాయి. ఆ విధంగా ఎన్టీ రామారావు గారు  బాలయ్య ప్రేమ పెళ్లి జరగకుండా ఆపాడని తెలుస్తోంది. అప్పట్లో బాలయ్య ప్రేమించిన ఆ స్టార్ హీరోయిన్ కుష్బూ అని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్త ఎంతవరకు  వాస్తవం అనేది తెలియదు. కానీ వీరిద్దరి పేర్లు అప్పట్లో బాగా వినిపించాయి.Also Read: తారకరత్న కోసం బాలకృష్ణ చేసిన పనికి అలేఖ్యా రెడ్డి ఎమోషనల్‌ పోస్ట్‌..

 


End of Article

You may also like