నందమూరి తారకరత్న మరణం కుటుంబంతో పాటుగా నందమూరి అభిమానులకు తీవ్ర విషాదాన్ని కలిగించిన విషయం అందరికి తెలిసిందే. 40 సంవత్సరాల వయసులో తారకరత్న గుండె పోటుతో కన్నుమూసి, భార్య అలేఖ్యా రెడ్డికి తీరని బాధను మిగిల్చాడు. ఆమెని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.

Video Advertisement

ఇప్పటికి కూడా అలేఖ్య తారకరత్న జ్ఞాపకాలతో బాధపడుతోంది. అలేఖ్య ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులే దానికి నిదర్శనం. తారకరత్న కన్నుమూసినప్పటి నుండి బాలకృష్ణ తారకరత్న కుటుంబానికి అండగా ఉంటున్నారు. తాజాగా బాలకృష్ణ తీసుకున్న సంచలన నిర్ణయంతో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఇంస్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ చేశారు.  తారకరత్న జ్ఞాపకార్థంగా గుండె సమస్యలతో బాధపడే పేదవారికి వారికి ఉచితంగా వైద్యం అందించాలని బాలయ్య  నిర్ణయం తీసుకున్నారు. దాని కోసం బసవతారకం హాస్పటల్ లో ఒక బ్లాక్ ను ఏర్పాటు చేసి, దానికి  తారకరత్న బ్లాక్ అని పేరు పెట్టారు. బసవతారకం హాస్పటల్ లో మాత్రమే కాకుండా  హిందూపురంలో బాలయ్య నిర్మిస్తున్న హాస్పటల్లో కూడా ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. బాలకృష్ణ మంచి మనసును చాటుకున్నారని ఫ్యాన్స్ నెటిజెన్స్ నుండి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
బాలయ్య కొడుకు తారకరత్న పైన ఉన్న ప్రేమను తెలిపేందుకు హృద్రోగ బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలని బాలయ్య తీసుకున్న నిర్ణయం పట్ల అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం పట్ల  తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి కూడా బాలకృష్ణను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. అందులో బాలకృష్ణ ఫోటోను కూడా షేర్ చేశారు. ఆ పోస్ట్ లో ‘మీమీద ఉన్న కృతజ్ఞతను ఎలా చెప్పాలో,  ఏమి చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది. మీ హృదయం బంగారం అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. మీలా ఎవరు చేయలేరు. మీలో తండ్రిని, స్నేహితున్ని  చూశాము. మీలో ఇప్పుడు దేవుడిని కూడా చూస్తున్నాం.  నాకు చెప్పడానికి మాటలు రావట్లేదు.  నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకన్న ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తాం, జై బాలయ్య, జై జై బాలయ్య అని అలేఖ్య రెడ్డి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

Also Read: “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాలో “సమంత చెల్లెలు” గుర్తుందా..?? ఇప్పుడెలా ఉందో తెలుసా..??