సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేము. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమాలే జనాల మనసుల్లో అలా చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి . అలాంటి సినిమాలలో ఒకటే “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు “. 2013లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, హీరో మహేష్ బాబు హీరోలుగా, మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ చేసారు.
Video Advertisement
సంక్రాంతి కానుకగా జనవరి 11న 2013లో రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా రావు రమేష్, ప్రకాష్ రాజ్, జయసుధ, అంజలి, సమంత పాత్రలు బాగా డిజైన్ చేశాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ మూవీ లో హీరోయిన్ సమంతకు ముగ్గురు చెల్లెల్లు ఉంటారు. వారిలో అందరికన్నా చిన్న చెల్లి పాత్రలో నటించింది రచన సహదేవ.
రచన పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ లో సమంత తో కలిసి అల్లరి చేసి అందరిని అలరించింది. ఈ మూవీ లో హీరోయిన్ ఫ్యామిలీ ఒక హోటల్ కి వెళ్ళినప్పుడు రచన ..” ఏంటి కూలెక్కలేదా ఇంకా వాటరు..” అంటూ గోదావరి యాస లో చెప్పే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాతో రచనకి మంచి పాపులారిటీ వచ్చింది. తాజాగా ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
స్వతహాగా డాన్సర్ అయిన రచన ప్రస్తుతం సినిమాలకు దూరం గా ఉంటున్నారు. ఈమెకు 2019 లో వివాహం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. రచన ప్రస్తుతం సింగపూర్ లో నివసిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే రచన ఎప్పటికప్పుడు తన ఫోటోలని, ఫ్యామిలీ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటారు. ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసారు రచన. అయితే ఆమె ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆ ఫోటోలని చూసిన ఆమె ఫాన్స్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో చిన్న పిల్ల అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#1.
#2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
image credits: rachana official/ instagram