Ads
ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
Video Advertisement
ఒక రోజు జబర్దస్త్ లో అనసూయ యాంకర్ గా మనల్ని అలరిస్తుంటే, మరొక రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. అయితే ఇటీవల జబర్దస్త్ లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులు జబర్దస్త్ ను వీడిన సంగతి తెలిసిందే. తాజాగా, అనసూయ కూడా జబర్దస్త్ ను వీడబోతోంది అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ప్లేస్ లో మరో గ్లామరస్ యాంకర్ కి ఛాన్స్ రాబోతోంది అన్న వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. ఇంతకీ.. జబర్దస్త్ షోలో యాంకర్ అనసూయను రీప్లేస్ చేయబోతున్న ఆ గ్లామరస్ యాంకర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: “జయం” సినిమాకి “గోపీచంద్” అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.? ఆ డబ్బుతో ఏం చేసారంటే.?
2013 లో షో మొదలైనప్పుడు.. ఈ షో సక్సెస్ అవుతుంది అని ఎవరూ ఊహించలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన జబర్దస్త్ గత కొన్నేళ్లుగా సక్సెస్ రేట్ తో దూసుకుపోతూ వచ్చింది. ఈ షో సక్సెస్ అవుతుందని ఊహించని యాంకర్స్ అప్పట్లో ఈ షో చేయడానికి ఆసక్తి చూపలేదు. ఆ క్రమంలో ఈ ఆఫర్ తొలుత శ్రీముఖికి వచ్చినా ఆమె తిరస్కరించింది. ఆ తరువాత ఆ ఛాన్స్ అనసూయకు వెళ్ళింది. ఈ షోతో అనసూయ ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే.
ప్రస్తుతం ఆమె షో నుంచి తప్పుకునే ఛాన్స్ ఉందని వార్తలు వస్తుండడంతో ఆమె ప్లేస్ లో మరొకరిని ఎవరిని తీసుకుంటారో అన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే యాంకర్ మంజూష రాంపల్లి పేరు మొదటి ప్లేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కూడా తన గ్లామర్ ఫొటోలతో ఆకట్టుకుంటూ.. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆ ఛాన్స్ ఆమెకే వచ్చే ఛాన్స్ ఉందని అందరు అనుకుంటున్నారు.
End of Article