Pakka Commercial Review : “గోపీచంద్ – మారుతి” కాంబినేషన్‌లో వచ్చిన పక్కా కమర్షియల్… హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Pakka Commercial Review : “గోపీచంద్ – మారుతి” కాంబినేషన్‌లో వచ్చిన పక్కా కమర్షియల్… హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : పక్కా కమర్షియల్
  • నటీనటులు : గోపీచంద్, రాశి ఖన్నా, సత్య రాజ్.
  • నిర్మాత : అల్లు అరవింద్, బన్నీ వాస్.
  • దర్శకత్వం : మారుతి
  • సంగీతం : జేక్స్ బిజాయ్
  • విడుదల తేదీ : జులై 1, 2022

Pakka Commercial Review

స్టోరీ :

Video Advertisement

లాయర్ అయిన తండ్రి (సత్య రాజ్), అలాగే ఆయన కొడుకు లక్కీ (గోపీచంద్) మధ్య ఈ కథ నడుస్తుంది. తండ్రి కేవలం న్యాయం వైపు మాత్రమే ఉండాలి అంటే కొడుకు మాత్రం ఎలాంటి కేస్ అయినా వాదించాలి అని అనుకుంటాడు. ఈ నేపథ్యంలో రాశి కథలోకి ప్రవేశిస్తుంది. లక్కీ దగ్గర అసిస్టెంట్ గా చేరుతుంది. ఒక సమయంలో తన తండ్రితోనే లక్కీ కేస్ వాదించాల్సి ఉంటుంది. వీరిద్దరిలో ఎవరు గెలిచారు? చివరికి ఏమైంది? తండ్రి కొడుకుల్లో ఎవరు కరెక్ట్? లక్కీ తన తప్పు తెలుసుకున్నాడా? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

pakka commercial movie review

Pakka Commercial Review in Telugu రివ్యూ :

గోపీచంద్ సినిమాలు అంటేనే సాధారణంగా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కథ కూడా అంతకు ముందు ఎక్కడా చూడనట్టుగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలు అయినా సరే గోపీచంద్ స్టైల్ ప్రేక్షకులకి చాలా కొత్తగా అనిపిస్తుంది. అందుకే గోపీచంద్ సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. అదికూడా గోపీచంద్ మారుతి లాంటి డైరెక్టర్ తో సినిమా చూస్తున్నారు అనగానే ఈ సినిమాపై ఎప్పటినుంచో ప్రేక్షకులకి ఎలా ఉంటుందా అనే ఒక ఆసక్తి ఉంది. సాధారణంగా మారుతి సినిమా అంటే కామెడీ, కమర్షియల్ అంశాలు ఉంటాయి.

Pakka Commercial Review in Telugu

Pakka Commercial Review in Telugu

ఈ సినిమాలో కూడా అలాగే ఉన్నాయి. సినిమాలో చాలా వన్ లైనర్ డైలాగ్స్ ఉన్నాయి. చాలావరకు అవి వర్కౌట్ అయ్యాయి. కొన్ని చోట్ల మాత్రం కొంచెం ఎక్కువగానే అనిపించాయి. కొన్ని సీన్స్ కూడా అలాగే సాగదీసినట్లు అనిపిస్తాయి. కథలో పెద్దగా కొత్తదనం ఏమీ లేదు. అంతకుముందు చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది. ఇంక పర్ఫామెన్స్ విషయానికి వస్తే సినిమాలో నటించిన నటీనటులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ముఖ్యంగా గోపీచంద్, సత్య రాజ్ మధ్య వచ్చే సీన్స్ తెరపై చాలా బాగా కనిపించాయి. కథ విషయంలో మాత్రం దర్శకుడు ఇంకొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • నటీనటులు
  • నిర్మాణ విలువలు
  • అక్కడక్కడా వర్కౌట్ అయిన కామెడీ
  • పాటలు

మైనస్ పాయింట్స్:

  • కథలో లోపించిన కొత్తదనం
  • ఓవర్ గా అనిపించే కొన్ని సీన్స్

రేటింగ్ :

2.75/5

ట్యాగ్ లైన్ :

ఒక కామెడీ సినిమా చూడాలి, కమర్షియల్ సినిమా చూడాలి అని, కొత్త కథ లాంటివి ఏమీ ఆశించకుండా ఈ సినిమా చూస్తే మాత్రం పక్కా కమర్షియల్ ఒక్కసారి చూడగలిగే సినిమా అవుతుంది.


End of Article

You may also like