“మిడిల్ క్లాస్ అంటే తిండికి దిక్కు లేకపోవడం కాదు..!” అంటూ… “ఫ్యామిలీ స్టార్” చూసి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి రాసిన లెటర్..! ఇతను ఏం చెప్పాడంటే..?

“మిడిల్ క్లాస్ అంటే తిండికి దిక్కు లేకపోవడం కాదు..!” అంటూ… “ఫ్యామిలీ స్టార్” చూసి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి రాసిన లెటర్..! ఇతను ఏం చెప్పాడంటే..?

by Harika

Ads

అయ్యా డైరెక్టర్ గారూ, హీరో గారూ,

Video Advertisement

నమస్కారం. మీరు చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఇటీవల చూశా. సినిమా ట్రైలర్ చూస్తే ఏదో చెప్పాలి అనుకుంటున్నారు అనిపించింది. కానీ మిడిల్ క్లాస్ పేరుతో మీరు ట్రైలర్ లో చూపించిన విషయాలే కాస్త కొత్తగా అనిపించాయి. సరేలే. ట్రైలర్ చూసి సినిమా గురించి ఏం అనుకుంటాం. సినిమా విడుదల అయ్యాక అసలు మీరు ఏం చూపించారు చూద్దాం అనుకున్నా. రెస్పాన్స్ చూశాక ఓటీటీలోకి వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నా. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా చూశా. నేను కూడా ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో పెరిగిన వాడిని. నాకు కూడా కుటుంబం ఉంది. కానీ మేము ఎప్పుడూ ఇలాంటి పనులు చేయలేదు. మేమే కాదు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయరు.

minus points in family star trailer

మా ఇంట్లో ఒకవేళ దోస పిండి తక్కువగా ఉంటే, లేదా తినే పిల్లలు ఎక్కువగా ఉంటే, మా అమ్మ నాన్నలు వాళ్లు పస్తులు ఉండి అయినా సరే మా కడుపు నిండా తిండి పెడతారు. అంతే కానీ అంత పిసినారితనంగా మూడు చుక్కలతో దోస అయితే వేసి పెట్టలేదు. తిండికి కూడా దిక్కులేని అంత దీనస్థితిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండరు. అంత మిడిల్ క్లాస్ వాళ్ళు అయినప్పుడు, చుట్టుపక్కల ఉన్న కిరాణా కొట్టులో సరుకులు తెచ్చుకోకుండా, విజేత సూపర్ మార్కెట్ లో సరుకులు ఎందుకు తెచ్చుకున్నారో నాకైతే అర్థం కాలేదు. ఎంత మిడిల్ క్లాస్ వాడైనా, పిల్లలు అది కావాలి ఇది కావాలి అని మారం చేస్తూ ఉంటే, ఏదో ఒకటి చెప్పి వాళ్ళని ఆపుతారు కానీ, కొనుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్లి కొనుక్కోవద్దు అని చెప్పరు.

minus points in family star trailer

మీ ఇంటి పైన రెంట్ ఉండే అమ్మాయి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవద్దు అని చెప్పడం ఏంటి? మీ ఇంట్లో పిల్లలకు చెప్పుకోలేని వాళ్ళు, బయట వాళ్లకి ఎందుకు చెప్తున్నారు? కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళ ఇళ్ళల్లో మాత్రమే కాదు. డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లో కూడా కుటుంబం అంతా కలిసి ఉండే వాళ్ళు ఉంటారు. హీరో అన్న ఒకే ఒక మాటకి, హీరో వాళ్ళ అన్న బాధపడి తాగుడు అలవాటు చేసుకుంటాడా? సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వ్యక్తి మెదడు మరీ ఇంత బలహీనంగా ఉంటుందా? ఇంటర్వ్యూ కూడా చేయకుండా ఏ కంపెనీలో ఉద్యోగం ఇస్తారో మాకు కూడా కాస్త చెప్పండి. ఎందుకంటే, జాబ్ మారాలి అంటే ఇంటర్వ్యూల కోసం వెతికి వెతికి అలసిపోతున్నాం. ఎప్పుడో క్యాంపస్ ఏదో జరిగినప్పుడు వచ్చి జాబ్ ఇస్తానంటే హీరో రిజెక్ట్ చేయడం బానే ఉంది.

minus points in family star trailer

మళ్లీ మూడు, నాలుగు సంవత్సరాలు తర్వాత అంతమంది కొత్త టాలెంట్స్ వచ్చిన తర్వాత హీరోకి ఏ భరోసా మీద జాబ్ ఇచ్చారు? ఇస్తే ఇచ్చారు. కనీసం ఒక ఇంటర్వ్యూ లేదు. సరే అది కూడా లేదు అనుకుందాం. మరీ రెండు సంవత్సరాల శాలరీ అడ్వాన్స్ ఇవ్వడం ఏంటయ్యా. సినిమా అంటే లాజిక్స్ ఉండాలి అని అనుకోవట్లేదు. కానీ, మిడిల్ క్లాస్ పేరుతో మీరు చూపించిన పనులు నవ్వు తెప్పించాయి. మిడిల్ క్లాస్ అంటే కటిక దరిద్రం కాదు. పొదుపుకి, పిసినారితనానికి తేడా ఉంటుంది. సినిమాలో మీరు చూపించింది పొదుపు అయితే కాదు. మామూలుగా మేము ఎక్కడికైనా వెళ్లాలి అంటే, ఒక ఆటోలో నలుగురు కంటే ఎక్కువ కూర్చుంటే, ఆటో డ్రైవర్ ఒప్పుకోడు. తనకి లోడ్ ఎక్కువ అయిపోతుంది అని, నడపడం కష్టంగా ఉంటుంది అని చెప్తాడు.

మేం కూడా అర్థం చేసుకొని రెండు ఆటోలు మాట్లాడుకుంటాం. అలాంటిది, మీ సినిమాలో హీరో ముగ్గురు ఆడవాళ్ళని, ఐదు మంది పిల్లలని ఒకటే ఆటోలో తీసుకొస్తాడు. ఎలా సాధ్యం? సరే తీసుకొస్తే తీసుకొచ్చాడు. ఆడవాళ్ళతో తప్పుగా ఎలా ప్రవర్తించకూడదు అనేది చూపిస్తాను అని చెప్తాడు. కానీ హీరో మాత్రం అలాంటి మాటలు అవతలి పక్క ఉన్న వ్యక్తితో మాట్లాడుతాడు. ఇది చూసి పిల్లలు తప్పుగా అర్థం చేసుకోరా? హీరో చెప్పే విలువలు ఈ సీన్ లో ఎక్కడ ఉన్నాయి? మీరు మిడిల్ క్లాస్ మీద సినిమా తీయాలి అనుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ల గురించి తెలుసుకొని సినిమా తీయండి. అంతే కానీ ఇలాంటి సినిమాలు తీసి, దానికి మిడిల్ క్లాస్, ఫ్యామిలీ ఇలాంటి పేర్లు మాత్రం పెట్టకండి.

ఇట్లు,
ఒక సగటు మిడిల్ క్లాస్ వ్యక్తి.

ALSO READ : రాఖీ లో అంత మంచి పాత్రలో నటించిన తర్వాత కూడా మంజూష సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారు..? కారణం ఇదేనా..?


End of Article

You may also like