గుప్పెడంత మనసు రిషి చేయబోతున్న సినిమా ఏంటో తెలుసా..?

గుప్పెడంత మనసు రిషి చేయబోతున్న సినిమా ఏంటో తెలుసా..?

by Mohana Priya

Ads

గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా అందరికీ పరిచయం అయ్యారు ముఖేష్ గౌడ. ఈ సీరియల్ లో రిషి అనే పాత్రలో ముఖేష్ నటించారు. ఒకే ఒక్క సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ప్రేక్షకులకి ఈ పాత్ర ఎంత అలవాటు అయ్యారు అంటే, ఇప్పుడు రిషి పాత్ర సీరియల్ లో కనిపించట్లేదు. దాంతో సీరియల్ చూడటానికి జనాలు ఆసక్తి చూపించట్లేదు. మధ్యలో రిషి పాత్ర వస్తాడు అన్నట్టు చాలా సార్లు ఒక హింట్ ఇచ్చి వదిలారు. కానీ ప్రతిసారి నిరాశ మిగిలింది. అయితే, ముఖేష్ గౌడ ఈ సీరియల్ వదిలి వెళ్ళిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.

Video Advertisement

guppedantha manasu mukesh gowda new movie

సీరియల్ యాజమాన్యానికి, ముఖేష్ గౌడకి గొడవలు ఉన్నాయి అన్నట్టు ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది. ఎంతో కాలం నుండి ఇవన్నీ అవుతున్నాయి. దాంతో ముఖేష్ గౌడ సీరియల్ వదిలి వెళ్ళిపోయారు అని అంటున్నారు. మరి వారి మధ్య ఏం గొడవలు ఉన్నాయి అనేది తెలియదు. సీరియల్ లో మాత్రం ఆ పాత్ర మిస్ అయినట్టే చూపిస్తున్నారు. వసుధార పాత్ర మీద సీరియల్ నడుస్తోంది. ఇప్పుడు వసుధార పాత్రని సైడ్ పాత్ర చేస్తున్నారు. సీరియల్ ట్రాక్ అంతా మారిపోయింది. ముఖేష్ గౌడ సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా, సీరియల్ లో ఆయనని మిస్ అవుతున్నట్టు అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరొక పక్క ముఖేష్ గౌడ ఒక సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించారు. గీతా శంకరం అనే ఒక సినిమాలో ముఖేష్ గౌడ హీరోగా నటిస్తున్నారు.

ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రముఖ నటుడు మురళీధర్ గౌడ్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఒక ప్రేమ కథగా ఈ సినిమా రూపొందుతోంది. ముఖేష్ గౌడ కన్నడలో కొన్ని సీరియల్స్ లో నటించడంతో పాటు, తెలుగులో కూడా ప్రేమ్ నగర్ అనే ఒక సీరియల్ లో నటించారు. ఇప్పుడు సినిమాల్లోకి అడుగు పెడుతున్నారు. చాలా మంది సీరియల్ నటులు సినిమాల్లో హీరోలుగా నటించారు. ఇప్పుడు ముఖేష్ గౌడకి ఉన్న పాపులారిటీ సినిమాల్లో హీరోగా కొనసాగడానికి సహాయపడుతుంది అని భావిస్తున్నారు. ముఖేష్ గౌడ ఈ సినిమా స్టిల్ షేర్ చేసుకున్న తర్వాత, ఎంతో మంది అభిమానులు సంతోషపడుతూ ముఖేష్ గౌడకి అభినందనలు తెలిపారు.

ALSO READ : 22 ఏళ్ళ శ్రీలీల పక్కన ఆ 52 ఏళ్ళ హీరోనా.? కూతురు లాగా ఉంటుంది కదా అంటూ ట్రోల్స్.!


End of Article

You may also like